News


నేడు బడ్జెట్‌ హల్వా ఉత్సవం

Monday 20th January 2020
news_main1579507538.png-31048

హల్వా తయారితో బడ్జెట్‌ రూపలక్పనకు శ్రీకారం!

-నార్త్‌ బ్లాక్‌లో హల్వా ఉత్సవం
న్యూఢిల్లీ: భారత సంప్రదాయంలో ఏ పనిని ప్రారంభించాలన్నా మొదట స్వీట్‌తో నోరు తీపిచేసుకుని ప్రారంభించడం ఆనవాయితి. ఇక ప్రతిఏటా బడ్జెట్‌ను రూపొందించే ముందు కూడా అధికారులందరి నోరు తీపిచేయడం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా సోమవారం(జనవరి 20) న హల్వా తయారు చేసి బడ్జెట్‌-2020 రూపకల్పనలో పాల్గొనే అధికారులందరికి ఆర్థిక మంత్రి నార్త్‌ బ్లాక్‌లో నోర్లు తీపి చేయనున్నారు. హల్వాను భారీ స్థాయిలో వండి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సిబ్బంది మొత్తానికి వడ్డిస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అందరు హల్వా తిన్న తర్వాత బడ్జెట్‌ తయారీ ప్రాంగణం నుంచి సిబ్బంది ఎవర్నీ బయటకు వెళ్లడానికి అనుమతించరు. బడ్జెట్‌ పత్రాలను గోప్యంగా ఉంచేందుకు సిబ్బంది ఎవరూ ఫోన్లు  వాడకూడదు. ఇక్కడ ఫోన్లు నిషిద్ధం. అంతేగాకుండా బడ్జెట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకు సిబ్బంది తమ కుటుంబసభ్యులతో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.



You may be interested

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ హైజంప్‌- ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ పతనం

Monday 20th January 2020

ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు  పతన బాట పట్టాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. కాగా.. లోఖండ్వాలా డీబీ రియల్టీ కంపెనీలో ప్రధాన వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కౌంటర్లో అమ్మకాలు

బ్యాంక్‌ నిఫ్టీ: గరిష్టం నుంచి 578 పాయింట్లు డౌన్‌

Monday 20th January 2020

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ గరిష్టస్థాయి నుంచి 578 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3 ఫలితాలు అంచనాలు మించిన నమోదు కావడంతో నేడు ఈ భారీ గ్యాప్‌లో ప్రారంభమైంది. ఫలితంగా నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,590.65)తో పోలిస్తే 334 పాయింట్ల భారీ లాభంతో 31,923.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అనంతరం మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల్లో ఇండెక్స్‌ ఇదే

Most from this category