News


కొంచెం పెరిగిన సబ్సిడీ బిల్లు

Sunday 2nd February 2020
news_main1580621010.png-31436

ఆహార, ఇంధన, ఎరువులపై కేంద్ర సబ్సిడీల బిల్లు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2020-21లో రూ.2,27,793.89 లక్షల కోట్లకు చేరింది. సవరించిన అంచనాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బిల్లు దాదాపు రూ.2,27,255 కోట్లు. 

  • ఆహారధాన్యాలకు సంబంధించి సబ్సిడీ 6.33 శాతం పెరుగుదలతో రూ.1,08,688.35 కోట్ల నుంచి రూ.1,15,569.68 కోట్లకు పెరగనుంది. 
  • ఎల్‌పీజీ, కిరోసిన్‌సహా ఫ్యూయెల్‌ సబ్సిడీల భారం రూ.38,568.86 కోట్ల నుంచి రూ.40,915.21 కోట్లకు చేరుతుందని అంచనా. ఒక్క ఎల్‌పీజీ విషయానికి వస్తే, రూ.34,085.86 కోట్ల నుంచి రూ.37,256.21 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌ అంచనావేసింది. కిరోసిన్‌పై మాత్రం కేటాయింపులు రూ.4,483 కోట్ల నుంచి రూ.3,659 కోట్లకు తగ్గింది.
  • ఇక ఎరువుల విషయానికి వస్తే, సబ్సిడీ  రూ.79,997.85 కోట్ల నుంచి రూ.71,309 కోట్లకు తగ్గించడం జరిగింది.  



You may be interested

బడ్జెట్‌- డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ. 1.2 లక్షల కోట్లు

Sunday 2nd February 2020

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సమీకరించనున్న రూ. 65,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపుకావడం గమనార్హం! కాగా.. నిజానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 1.05 లక్షల కోట్లను సమీకరించాలని భావించింది. అయితే ఇప్పటివరకూ

 ఆరోగ్యానికి రూ. 69, 000 కోట్లు

Sunday 2nd February 2020

ఆయుష్మాన్‌ భారత్‌ : రూ.6,400 కోట్లు  స్వచ్ఛ భారత్‌ మిషన్‌ : రూ. 12, 300 కోట్లు  జల్‌జీవన్‌ మిషన్‌ : రూ. 11,500 కోట్లు    న్యూఢిల్లీ:  ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి

Most from this category