STOCKS

News


వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

Wednesday 7th August 2019
news_main1565154361.png-27591

  • అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై కసరత్తు
  • ఏటా రూ. 200 కోట్ల దాకా ఆదాకు అవకాశం

న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో బాగంగా అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్‌ ఎక్స్చేంజీల్లో విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా  15 శాతం దాకా ఆదా చేయొచ్చని భావిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు. నెలవారీ ఆదాయాలు, వ్యయాలకు (నిర్వహణ వ్యయాలు, జీతభత్యాలు) మధ్య ఏకంగా రూ. 800 కోట్ల మేర తేడా ఉంటోందని ఆయన చెప్పారు. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినా సవాళ్లు కొంత మేర ఉంటాయన్నారు. ఉద్యోగులకు జులై నెల జీతాల చెల్లింపుల కోసం అంతర్గత వనరుల ద్వారానే నిధులు సమకూర్చుకున్నామని, టెలికం శాఖ నుంచి ఆర్థిక సహాయమేదీ కోరలేదని పుర్వార్ వివరించారు. "ఏయే నిర్వహణ వ్యయాలు తగ్గించుకోగలమో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా ముందుగా అవుట్‌సోర్సింగ్ వ్యయాలను తగ్గించుకుని ఆయా కార్యకలాపాలను అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలుంటుందేమో పరిశీలిస్తున్నాం" అని ఆయన చెప్పారు. ప్రస్తుత వనరులను మరింత సమర్ధంగా ఉపయోగించుకోవాలని నిర్దేశించుకున్నామని.. అయితే సేవల నాణ్యతలో రాజీపడబోమని పుర్వార్ స్పష్టం చేశారు. ఆప్టికల్‌ ఫైబర్ కేబుల్ మెయింటెనెన్స్‌, కేబుల్ రిపేర్లు మొదలైన పనులను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం అవుట్‌సోర్స్ చేసినట్లు ఆయన వివరించారు. 

రూ.14 వేల కోట్ల నష్టాలు...
2018-19 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు రూ. 14,000 కోట్ల మేర ఉంటాయని, ఆదాయం క్షీణించి రూ. 19,308 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,65,179 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఆదాయంలో సిబ్బంది వేతన వ్యయాలు ఏకంగా 75 శాతంగా ఉన్నాయి. అదే ప్రైవేట్ రంగ సంస్థల విషయానికొస్తే.. ఇవి 2.95 శాతం- 5.59 శాతం స్థాయిలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా నష్టాలు, రుణాల భారంతో కుంగుతున్న రెండు ప్రభుత్వ రంగ టెల్కోలు.. బీఎస్‌ఎన్ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను విలీనం చేసే ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలిస్తోంది. You may be interested

రాయల్‌ జెల్లీ హనీ రూ.1.5 లక్షలు

Wednesday 7th August 2019

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె రకం ఇదే అందుబాటులో 100కుపైగా రకాల వెరైటీలు రూ.1,560 కోట్లకు భారత హనీ మార్కెట్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్‌, విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ నిండుగా ఉండడంతో ఫుడ్‌ సప్లిమెంట్స్‌, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్‌

ఇక రిలయన్స్‌, బీపీ పెట్రోల్ బంకులు

Wednesday 7th August 2019

అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 5,500కు బంకుల సంఖ్య విమాన ఇంధన విక్రయ కార్యకలాపాలు కూడా రెండు సంస్థల జాయింట్ వెంచర్  2020 ప్రథమార్ధంలో ఒప్పందం పూర్తి  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

Most from this category