News


బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్ఎస్‌..

Thursday 7th November 2019
news_main1573096362.png-29402

  • 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వర్తింపు
  • 80,000 మంది దాకా వినియోగించుకుంటారని అంచనా
  • డిసెంబర్ 3 దాకా అవకాశం
  • సంస్థకు రూ. 7,000 కోట్ల ఆదా

న్యూఢిల్లీ: కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. సుమారు 70,000-80,000 మంది దాకా ఉద్యోగులు దీన్ని వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ పి.కె. పుర్వార్ తెలిపారు. దీనితో వేతనాల బిల్లు భారం దాదాపు రూ. 7,000 కోట్ల దాకా తగ్గగలదని ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్ గురించి ఉద్యోగులకు తెలియజేయాలంటూ క్షేత్రస్థాయి యూనిట్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. దాదాపు ఒక లక్ష మందికి వీఆర్ఎస్‌ వినియోగించుకునే అర్హత ఉంటుంది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. 

స్కీము ఇలా ...
'బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వచ్ఛంద విరమణ పథకం - 2019' ప్రకారం పర్మనెంట్ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన వారికి కూడా వీఆర్‌ఎస్ వర్తిస్తుంది. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు దీన్ని వర్తింపచేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. సర్వీసు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల వేతనం, సూపర్‌యాన్యుయేషన్‌ దాకా మిగిలిన సర్వీసుకు సంబంధించి ప్రతి ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున చెల్లించనుంది. 



You may be interested

నెలకు రూ.64,167 కోట్ల లావాదేవీలు

Thursday 7th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ‘గూగుల్‌ పే’ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో 6.7 కోట్లకు చేరుకుంది. 2018 సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరు నాటికి యాక్టివ్‌ యూజర్లు మూడు రెట్లు పెరిగారని గూగుల్‌ పే ఎండీ సజిత్‌ శివానందన్‌ బుధవారం తెలిపారు. వ్యాపారస్తుల కోసం గూగుల్‌ పే యాప్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2017 సెప్టెంబరులో గూగుల్‌ పే యాప్‌ను భారత్‌లో

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

Thursday 7th November 2019

నిలిచిన ఇళ్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధి రూ.25,000 కోట్లతో ఏఐఎఫ్‌ ఏర్పాటు ఇందులో ప్రభుత్వ వాటా రూ.10,000 కోట్లు ఎన్‌పీఏ ప్రాజెక్టులకూ సాయం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల

Most from this category