News


నెల పాటు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్‌

Saturday 21st March 2020
news_main1584764899.png-32608

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌
ఇంటి నుంచి పనిచేసుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమాచారం పంపడాలు, సంప్రదింపులు వంటివి చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక నెల రోజుల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ల్యాండ్‌లైన్‌ కస్టమర్లు అందరూ, నూతనంగా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకునే కస్టమర్లు నెల రోజుల పాటు ఉచిత సదుపాయాన్ని పొందొచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా కాపర్‌ కేబుల్‌ ఆధారిత కనెక్షన్‌ తీసుకునే వారు ఇన్‌స్టలేషన్‌ చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కేవలం మోడెమ్‌ ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ ఎంచుకుంటే మాత్రం ఇన్‌స్టలేషన్‌ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజుల ఉచిత సర్వీసుల తర్వాత చెల్లింపు సేవలకు కస్టమర్లు మారతారని కంపెనీ తెలిపింది. 



You may be interested

ఆర్థిక సాయం చేయండి..

Saturday 21st March 2020

తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌, మాల్స్‌, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్‌ తన నివేదికలో కోరింది. చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఇది జరక్కపోతే స్టీల్‌, జెమ్స్‌, జువెల్లరీ, కన్‌స్ట్రక్షన్‌, ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ రంగాలూ కరోన బారిన పడతాయని హెచ్చరించింది.   

వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం

Saturday 21st March 2020

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్‌ఎంఈ, పశుసంవర్ధక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్‌ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి

Most from this category