News


అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Thursday 2nd January 2020
news_main1577936158.png-30603

  • రూ. 300 కోట్ల సమీకరణపై కసరత్తు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్‌) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన మరో టెల్కో ఎంటీఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనితో బీఎస్‌ఎన్‌ఎల్‌ జీతాల బిల్లు 50శాతం, ఎంటీఎన్‌ఎల్‌ బిల్లు 75 శాతం మేర తగ్గుతుందని అధికారి వివరించారు. బాండ్ల ద్వారా సుమారు రూ. 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తునివ్వనుందని పేర్కొన్నారు. దీనిపై ఆర్థిక శాఖకు ఇప్పటికే లేఖ రాశామని, అనుమతులు వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో సమీకరణ జరిపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, పెట్టుబడుల కోసం వినియోకించనున్నట్లు వివరించారు. మరోవైపు, అసెట్స్ విక్రయానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆ‍స్తులను గుర్తించినట్లు, పెట్టుబడులు.. ప్రభుత్వాస్తుల నిర్వహణ విభాగం (దీపం)తో చర్చలు కూడా జరిపినట్లు చెప్పారు. 



You may be interested

స్వల్ప లాభాలతో ప్రారంభం

Thursday 2nd January 2020

ఆసియా ట్రెండ్‌ను అనుసరిస్తూ గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప లాభంతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 41,340 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల పెరుగుదలతో 12,198 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. న్యూఇయర్‌ సెలవుల అనంతరం ఈ రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించిన చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ మార్కెట్లు 1.2 శాతం జంప్‌చేశాయి. జనవరి 15న ట్రేడ్‌డీల్‌పై సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌

డిసెంబర్‌ వాహన విక్రయాలు: మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి

Thursday 2nd January 2020

మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి హ్యుందాయ్‌, టయోటా విక్రయాల్లో క్షీణత న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్‌లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు.. పండుగల సీజన్‌ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధి రేటును నమోదుచేయడమే

Most from this category