News


బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలొచ్చాయ్‌

Tuesday 31st December 2019
Markets_main1577767309.png-30551

  • రూ. 1,700 కోట్ల పాత బకాయిలు చెల్లింపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. విక్రేతలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పాత బకాయిలను చెల్లించినట్లు సోమవారం ప్రకటించింది. వీరికి చెల్లించాల్సిన రూ. 1,700 కోట్ల మొత్తాన్ని ఇచ్చేసినట్లు సంస్థ చైర్మన్ పి.కె. పుర్వార్ వెల్లడించారు. ఈ మొత్తంతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన నవంబర్‌ జీతాలు (రూ. 800 కోట్లు) విడుదలచేసినట్లు చెప్పారు. ఇక తాజా సర్ధుబాట్లు అనంతరం రుణదాతలకు రూ. 10,000 కోట్లు బాకీ ఉన్నట్లు స్పష్టంచేశారు. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు సంస్థలు 2010 నుంచి భారీ నష్టాల్లోనే ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో ఎంటీఎన్‌ఎల్‌ 9 ఏళ్లు నష్టాలనే ప్రకటించగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ వరుస నష్టాలను ప్రకటిస్తూనే ఉంది. 



You may be interested

కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి నిష్క్రమించిన నికో

Tuesday 31st December 2019

ఈ కంపెనీ వాటాను టేకోవర్‌ చేసిన రిలయన్స్‌, బీపీలు  న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి  కెనడాకు చెందిన నికో రీసోర్సెస్‌ వైదొలిగింది. ఈ బ్లాక్‌లో ఈ కంపెనీకి ఉన్న 10 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు టేకోవర్‌ చేశాయి. ఈ వాటా టేకోవర్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీలు 3.6 కోట్ల డాలర్లు చెల్లించాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీలతో నికో రీసోర్సెస్‌ పరోక్ష అనుబంధ

కొనేవారు రాకుంటే .. ఎయిరిండియా మూసివేతే

Tuesday 31st December 2019

ఆందోళనలో కంపెనీ వర్గాలు ముంబై: వచ్చే ఏడాది జూన్‌లోగా కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోయిన పక్షంలో ప్రభుత్వ రంగ విమానయాన రంగ సంస్థ ఎయిరిండియా మూసివేత తప్పదని కంపెనీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిర్వహణ వ్యయాల అవసరాల కోసం రూ. 2,400 కోట్లు సమీకరించుకోవడానికి తగినంత పూచీకత్తు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం కేవలం రూ. 500 కోట్లకు మాత్రమే హామీనిచ్చిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి కార్యకలాపాలు

Most from this category