News


ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎన్‌టీపీసీ హ్యాపీ

Tuesday 11th February 2020
news_main1581390480.png-31670

  • 2018-19లో లాభదాయక కంపెనీలు ఇవి...
  • పార్లమెంటులో సర్వే

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 2018-19లో లాభాల బాటన నిలిచిన కంపెనీల్లో తొలి మూడు స్థానాల్లో ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయన్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీలు ఉన్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఎంటీఎన్‌ఎల్‌లు భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రభుత్వ రంగ కంపెనీలుగా మిగిలాయి. వరుసగా మూడేళ్ల నుంచీ ఈ కంపెనీలది ఇదే పరిస్థితి. 2018-19కి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వే ఒకటి ఈ అంశాలను తెలియజేసింది. నష్టాలను చవిచూసిన 70 ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) 94.04  శాతం వాటా కేవలం 10 సంస్థలవే కావడం గమనార్హం.  మొత్తం సీపీఎస్‌ఈల ఆదాయం 2018-19లో రూ.24,40,748 కోట్లయితే, 2017-18లో ఈ మొత్తం రూ.20,32,001 కోట్లు కావడం గమనార్హం. అంటే వృద్ధి 20.12 శాతం.  ఇక ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాలు, జీఎస్‌టీ, కార్పొరేట్‌ పన్ను,  డివిడెండ్లు, ఇతర సుంకాలు, పన్నుల రూపంలో సీపీఎస్‌ఈల నుంచి కేంద్ర ఖజానాకు 2017-18లో రూ.3,52,361 కోట్లు లభిస్తే, 2018-19లో ఈ మొత్తం రూ. 3,68,803 కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి 4.67 శాతంగా నమోదయ్యింది. సర్వే ప్రకారం, 2019 మార్చి నాటికి 348 సీపీఎస్‌ఈల్లో 249 పనిచేస్తున్నాయి. 86 నిర్మాణంలో ఉన్నాయి. 13 దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. 



You may be interested

25 శాతం తగ్గిన గెయిల్‌ నికర లాభం

Tuesday 11th February 2020

న్యూఢిల్లీ: గెయిల్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్‌లో 25 శాతం తగ్గింది. సహజ వాయువు, ఎల్‌పీజీ, లిక్విడ్‌ హైడ్రోకార్బన్ల మార్కెటింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో రూ.1,250 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరు వారీ ఆర్జన రూ.2.77గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.1,681 కోట్లుగా ఉండడం గమనార్హం. సహజ వాయువు మార్కెటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం 9.5 శాతం తగ్గి రూ.14,663 కోట్లుగా ఉంది.

వాహన అమ్మకాలు... బే‘‘కార్‌’’..!

Tuesday 11th February 2020

జనవరిలో 6 శాతం తగ్గిన అమ్మకాలు కొనుగోలు భారం పెరగడం, మందగమనం కారణం సియామ్ నివేదికలో వెల్లడి గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన

Most from this category