News


బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి జియో టవర్ల కంపెనీ

Tuesday 17th December 2019
news_main1576552350.png-30256

  • డీల్‌ విలువ రూ.25,215 కోట్లు 
  • దేశీ ఇన్‌ఫ్రాలో భారీ విదేశీ పెట్టుబడి ఇదే!

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొబైల్‌ కంపెనీ రిలయన్స్‌ జియోకు చెందిన టవర్ల వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌పీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.25,212 కోట్లు. ఒక భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో విదేశీ కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే కావటం గమనార్హం. ఈ మేరకు బ్రూక్‌ఫీల్డ్‌తో తమ రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఈ డీల్‌లో భాగంగా టవర్ల వ్యాపారాన్ని నిర్వహించే టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ కంపెనీలో వంద శాతం వాటాను బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేస్తుంది. ఒప్పందంలో భాగంగానే బ్రూక్‌ఫీల్డ్‌ అనుబంధ సంస్థ అయిన బీఐఎఫ్‌ ఫోర్త్‌ జార్విస్‌ ఇండియా, ఇతర ఇన్వెస్టర్లకు టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కంపెనీ యూనిట్లను జారీ చేస్తుందని ముకేశ్‌ తెలియజేశారు. డీల్‌ పూర్తయిన తర్వాత టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌కు స్పాన్సరర్‌గా బ్రూక్‌ఫీల్డ్‌ వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని అనుమతులను త్వరలోనే సాధిస్తామని ఆయన చెప్పారు. ఈ ట్రస్ట్‌ దేశవ్యాప్తంగా మొత్తం 1,30,000 టవర్లను నిర్వహిస్తోంది. ఈ సంఖ్యను 1,75,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. 



You may be interested

ఏపీలో డావ్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ ప్లాంటు

Tuesday 17th December 2019

సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న చైనాకు చెందిన డావ్‌ ఈవీటెక్‌.. భారత్‌లో ఆటోమొబైల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నానికి దగ్గరలో దీనిని నెలకొల్పనుంది. 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఏటా 5

భారత్‌కు 5 శాతం వృద్ధి మంచిదే: మొబియస్‌

Tuesday 17th December 2019

భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థకు 5 శాతం వృద్ధి రేటు మంచిదేనని వర్ధమాన మార్కెట్ల నిపుణుడు మార్క్‌ మొబియస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌ అని అభివర్ణించారు. 1980ల చివర్లో భారత మార్కెట్లో పెట్టుబడులను ప్రారంభించిన ఆయన, ఈ స్థాయిలో భారత్‌ ఆర్థిక వృద్ధి సాధిస్తుందని తాను అంచనా వేయలేదని తెలిపారు. భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.   ‘‘ఇప్పుడు, భారత్‌, చైనా

Most from this category