News


ఇన్ఫీపై బుల్లిష్‌!

Monday 13th January 2020
news_main1578890338.png-30883

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు
మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్ఫోసిస్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ అంచనాలను కొనసాగించాలని నిర్ణయించాయి. శుక్రవారం కంపెనీ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. దీంతో పలు బ్రోకరేజ్‌లు రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడం లేదా టార్గెట్‌ పెంచడం లేదా రెండూ చేయడం చేపట్టాయి. క్యు3లో కంపెనీ నికరలాభం దాదాపు 24 శాతం పెరిగింది. దీనికితోడు పూర్తి ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్‌ను కంపెనీ పెంచింది. ఇటీవల కొందరు విజిల్‌ బ్లోయర్ల పేరిట చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని కంపెనీ ఆడిట్‌ కమిటీ పరిశీలన అనంతరం వెల్లడించింది. దీంతో కంపెనీపై అనలిస్టులు పాజిటివ్‌ అంచనాలు పెంచుకున్నారు. సోమవారం ట్రేడింగ్‌లో షేరు దాదాపు 3 శాతం లాభంతో కొనసాగుతోంది. 
ఇన్ఫోసిస్‌పై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..

కంపెనీ గైడెన్స్‌ అప్‌గ్రేడింగ్‌, ఆరోపణలపై జరిపిన విచారణలను మార్కెట్‌ పాజిటివ్‌గా స్వీకరించిందని యూబీఎస్‌ తెలిపింది. తోటి కంపెనీల కన్నా వేగంగా ఎదిగేందుకు ఇన్ఫీకి ఎక్కువ ఛాన్సులున్నాయని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. కంపెనీ రెవెన్యూ వృద్ది ప్రదర్శన టీసీఎస్‌ కన్నా మెరుగని, కంపెనీ మార్జిన్లు ఇకపై మరింత పెరుగుతాయని, ఇదే సమయంలో టీసీఎస్‌ మార్జిన్లు ఒత్తిడి ఎదుర్కొంటాయని యాక్సిస్‌ క్యాపిటల్‌ అభిప్రాయపడింది. ఇన్ఫీ కీలక విభాగాలైన బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ విభాగాలు యూఎస్‌ ఎన్నికల సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరం కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చని గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా వేసింది. 



You may be interested

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌- ఫలితాల జోష్‌

Monday 13th January 2020

తొలుత డీమార్ట్‌ షేరు 3.3 శాతం ప్లస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ రిటైల్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం(ఉదయం 10 ప్రాంతంలో) ఎన్‌ఎస్‌ఈలో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1.2 శాతం బలపడి రూ. 1898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 3.3 శాతం జంప్‌చేసి గరిష్టంగా రూ. 1940ను అధిగమించింది.  ఫలితాల జోరు డీమార్ట్‌ బ్రాండుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న ఎవెన్యూ

కొంత రిస్క్‌ తీసుకునే వారికి..

Monday 13th January 2020

కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ గతేడాది లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేస్తే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో వారికి నష్టాలు మిగిలాయి. కానీ, ఇదే పనితీరు ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక్కోసారి ఒక్కో విభాగం ర్యాలీ చేస్తే, మరో విభాగం నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్ని రకాల స్టాక్స్‌తో కూడిన విస్తృత ర్యాలీ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ తరహా ఒక్కో

Most from this category