News


టీసీఎస్‌పై బ్రోకరేజ్‌ల నిరాశ!

Friday 11th October 2019
news_main1570778345.png-28825

టార్గెట్‌ ధర తగ్గింపు
తొమ్మిది త్రైమాసికాల కనిష్టానికి మార్జిన్లు పడిపోయినట్లు ప్రకటించిన టీసీఎస్‌పై అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు నిరాశ వ్యక్తం చేశారు. కంపెనీ భవిష్యత్‌ అంచనాలు అందుకునే రేంజ్‌లో లేవని పెదవివిరుస్తున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 8042 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. సంస్థ ఆపరేటింగ్‌ మార్జిన్లలో 20 బీపీఎస్‌ క్షీణత నమోదయింది.

వివిధ బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ షేరుపై వెలిబుచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి...
1. ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2137 నుంచి 2104కు తగ్గించింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఆటుపోట్లు, రిటైల్‌ రంగంలో ఒడిదుడుకులు కలిసి వృద్ధిపై నెగిటివ్‌ ప్రభావం చూపాయి. మార్జిన్ల కుంగుబాటు నిరాశ పరిచింది. కరెన్సీ తలనొప్పులను కారణంగా చూపి రెవెన్యూ అంచనాలను తగ్గించింది.
2. ఇన్వెస్టెక్‌: అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 1910 నుంచి 1835కు తగ్గించింది. రెవెన్యూ, మార్జిన్లు అంచనాలను అందుకోలేకపోయాయి. స్వల్పకాలానికి మార్జిన్లు బాటమ్‌అవుట్‌ అయినట్లు కనిపిస్తోంది.
3. ఫిలిప్‌ క్యాపిటల్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2300 నుంచి 2200కు తగ్గించింది. ఫలితాలు నిరాశపరిచినా, డీల్స్‌ బలంగా కొనసాగాయి. వాల్యూషన్లు ఖరీదుగా కనిపిస్తున్నాయి. కంపెనీ బలమైన మౌలికాంశాలు కలిగి ఉన్నది. ఇప్పటికీ టీసీఎస్‌ను ఈ రంగంలో టాప్‌స్టాక్‌గా చెప్పవచ్చు.
4. యూబీఎస్‌: న్యూట్రల్‌రేటింగ్‌. రూ. 2300 టార్గెట్‌. డిమాండ్‌ మందగమనానికి రెండో త్రైమాసికం నిదర్శనం. 
5. యాక్సిస్‌ క్యాపిటల్‌: రెడ్యూస్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2060 నుంచి రూ. 1940కి తగ్గించింది. బలహీనమైన ఫలితాలని, తక్షణం కోలకునేందుకు ఎలాంటి ప్రేరకాలు లేవని తెలిపింది. 
6. ఎమ్‌కే: హోల్డ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2050 నుంచి రూ 1980కి తగ్గించింది. బలమైన ఆర్డర్లున్నా, కీలక రంగాల్లో వృద్ధి మందగమనమే ఫలితాలపై ప్రభావం చూపింది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ 6% పతనం!

Friday 11th October 2019

  నిధుల సమీకరణలో భాగంగా మైక్రోసాఫ్ట్‌తో యస్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతోందన్న మీడియా కథనాలను యెస్‌ బ్యాంక్‌ తోసిపుచ్చడంతో, ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతోంది. మధ్యాహ్నాం 12.49 సమయానికి ఈ బ్యాంక్‌ షేరు విలువ 6.35 శాతం నష్టపోయి రూ. 38.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 40.95 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ. 41.00 వద్ద

60 డాలర్ల పైకి క్రూడ్‌ ఆయిల్‌

Friday 11th October 2019

ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) దేశాలు చమురు సరఫరాను మరింత తగ్గించనున్నారనే సంకేతాలు వెలువడడంతో పాటు, యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో శుక్రవారం చమురు ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.03 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.86 శాతం లాభపడి బారెల్‌ 60.20 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.68 శాతం లాభపడి బారెల్‌ 54.45 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత సెషన్‌లో

Most from this category