News


బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

Tuesday 12th November 2019
news_main1573531213.png-29523

  • 33 శాతం వృద్ధి 
  • 6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు నికర అమ్మకాలు 

న్యూఢిల్లీ:- బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.403 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.303 కోట్లుతో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,855 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రి పేర్కొన్నారు. 


మార్కెట్‌ కంటే వేగంగా వృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తున్నామని వరుణ్‌ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 13 శాతం పెరిగిందని పేర్కొన్నారు. గత కూ​ఓయ2లో రూ.2,455 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ2లో 6 శాతం వృద్ధితో రూ.2,618 కోట్లకు పెరిగాయని తెలిపారు. ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడంతో వ్యయాలు పెద్దగా పెరగలేదని వివరించారు. అందుకే ఈ క్యూ2లో అత్యధిక నిర్వహణ లాభం సాధించామని తెలిపారు. 



You may be interested

ఇండియా సిమెంట్స్‌ లాభం రూ.5 కోట్లు

Tuesday 12th November 2019

గత క్యూ2లో రూ.5 లక్షల కోట్ల నష్టాలు  11 శాతం తగ్గిన ఆదాయం  చెన్నై:- ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ఈ  ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. సిమెంట్‌ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపడటం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్‌డీ ఎన్‌.

ఐబీసీ కింద ఆర్థిక సేవల సంస్థలకూ పరిష్కారం: సాహూ

Tuesday 12th November 2019

న్యూఢిల్లీ: దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)లో ఆర్థిక సేవల సంస్థలకు సంబంధించి కూడా పరిష్కార క్లాజ్‌ ఉందన్నారు దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) చైర్‌పర్సన్‌ ఎంఎస్‌ సాహూ. ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) అమల్లోకి వచ్చేంత వరకు ఈ నిబంధన కింద పరిష్కారాన్ని కోరవచ్చన్నారు. ఏదేనీ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (ఆర్థిక సేవలను అందించే సంస్థ)ను దివాలా చర్యల కింద నోటిఫై చేసే

Most from this category