News


కృష్ణపట్నంలో బీపీసీఎల్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌

Tuesday 27th August 2019
news_main1566877929.png-28033

  • రూ.1,500-1,700 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఆయిల్‌ రిఫైనింగ్‌, ఫ్యూయెల్‌ మార్కెటింగ్‌ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్‌ టెర్మినల్‌ను నిర్మించనుంది. 2022 నాటికి ఇది పూర్తి కానుంది. దీనికోసం రూ.1,500-1,700 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు బీపీసీఎల్‌ చైర్మన్‌ డి.రాజ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రాజెక్టులో బీపీసీఎల్‌కు 74 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీకి 26 శాతం వాటా ఉంటుందని చెప్పారు. తొలుత ఈ ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌ వార్షిక సామర్థ్యం 10 లక్షల టన్నులుగా ఉంటుంది. భవిష్యత్తులో దీనిని 50 లక్షల టన్నుల సామర్థ్యానికి చేర్చవచ్చు.



You may be interested

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

Tuesday 27th August 2019

ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఏటీఎంల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌

హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

Tuesday 27th August 2019

మూడేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి కంపెనీ ఫౌండర్‌, సీఈవో పీట్‌ లావ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ప్రీమియం మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ ప్లస్‌ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇక్కడి నానక్‌రామ్‌గూడలో 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సోమవారం

Most from this category