News


బీపీసీఎల్‌ షేరు వాటా విక్రయ ధర రూ. 510- 1110?

Wednesday 16th October 2019
news_main1571203880.png-28919

నిపుణుల అంచనా
ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుందన్న వార్తల నడుమ గత నెల్లో బీపీసీఎల్‌ షేరు దాదాపు 28 శాతం ర్యాలీ జరిపింది. ఇందులో వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ విలువ మదింపు చేసేందుకు తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను ఆరంభించింది.

ఈ నేపథ్యంలో కంపెనీ విలువ, ఇతర వివరాలపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి..
ప్రస్తుతం కంపెనీ ఎంటర్‌ప్రైజ్‌ వాల్యూ, వచ్చే సంవత్సరం కంపెనీ ఎబిటా కన్నా 8.2 రెట్లు అధికంగా ఉంది. ఈ విలువలో కంపెనీ రిఫైనరీల ఆదాయం, ఇంధన మార్కెటింగ్‌, మెంజాంబిక్‌ గ్యాస్‌ క్షేత్రాల్లో పదిశాతం వాటా విలువ, ఇతర కంపెనీల్లో బీపీసీఎల్‌ పెట్టిన పెట్టుబడుల విలువ ఉన్నాయి. 
కంపెనీ డీల్‌కు ఇన్వెస్టర్లకు ఇటీవల కుదిరిన అరామ్‌కో, ఆర్‌ఐఎల్‌ డీల్‌ ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. బీపీసీఎల్‌తో పోలిస్తే ఆర్‌ఐఎల్‌ రిఫైనర్‌ సదుపాయాలు ఉన్నతమైనవి కానీ ఈ డీల్‌లో కేవలం ఆర్థిక అవసరాలే ఉన్నాయి. బీపీసీఎల్‌ కొనుగోలుదారుకు కంపెనీ మేనేజ్‌మెంట్‌ పగ్గాలు కూడా చేతికి వస్తాయి. అందువల్ల ఆర్‌ఐఎల్‌ డీల్‌ ప్రకారం లెక్కిస్తే బీపీసీఎల్‌ విలువ ఒక్కో షేరుకు రూ. 620- 625 మధ్య ఉండొచ్చు. 
అంతర్జాతీయంగా రిఫైనరీ అసెట్‌ డీల్స్‌లో కాంప్లెక్సిటీని నెల్సన్‌ సూచీ ‍ప్రకారం టన్నుకు 43 డాలర్ల చొప్పున లెక్కిస్తుంటారు. గతంలో ఎస్సార్‌ ఆయిల్‌, రోజ్‌నెఫ్ట్‌ డీల్‌ సమయంలో కాంప్లెక్సిటీని టన్నుకు 42 డాలర్లుగా మదింపు చేశారు. ఆ సమయంలో ఎస్సార్‌ ఆయిల్‌ కాంప్లెక్సిటీ నెల్సన్‌ సూచీ ప్రకారం కేవలం 11.8 మాత్రమే ఉన్నా, దాదాపు మూడున్నర రెట్లు అధికంగా మదింపు చేశారు. ఈ సూచీ ప్రకారం బీపీసీఎల్‌ కాంప్లెక్సిటీ విలువ 8 ఉంది. 
ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ డీల్‌ సమయంలో రెండూ ప్రభుత్వ కంపెనీలే కావడంతో డీల్‌ విలువ పెద్దగా పెరగలేదు. కానీ తాజా అమ్మకంలో ప్రపంచ కంపెనీల మధ్య పోటీ బిడ్డింగ్‌ను ఆహ్వానించడం కారణంగా డీల్‌ విలువ భారీగా పెరగవచ్చు. అందుకే ఎలారా క్యాపిటల్‌ సంస్థ డీల్‌ విలువ పెరిగి షేరు ఒక్కింటికి రూ. 1100 లభించవచ్చని అంచనా వేసింది. 
పైన పేర్కొన్న అంశాలన్నీ పరిశీలిస్తే అమ్మకంలో షేరు విలువ దాదాపు రూ. 510- 1110 మధ్య పలకవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పై అంశాలతో పాటు డీల్‌ అనంతరం కంపెనీ విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానాలపై స్పష్టత వస్తే విలువ మదింపు మరింక కచ్ఛితంగా ఉండొచ్చు. You may be interested

బజాజ్‌ కన్జ్యూమర్‌ 15% ర్యాలీ!

Wednesday 16th October 2019

  బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించింది. ఫలితంగా బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం 11.01 సమయానికి  15.76 శాతం లాభపడి రూ. 235.75 వద్ద ట్రేడవుతోంది. బజాజ్‌ రీసోర్సెస్‌ మొత్తంగా 3,22,65,100 బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేర్లను షేరు రూ. 194.56 చొప్పున, రూ.

ఈ నెల కనిష్టం వద్ద పసిడి ధర

Wednesday 16th October 2019

ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర ఈ నెల(అక్టోబర్‌) కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ ఒప్పందానికి చైనా అంగీకరించడంతో ఆసియా మార్కెట్లు, బ్రెగ్జిట్‌ సంబంధిత ఒప్పందం ఈ వారంలోనే కుదరగలదన్న వార్తలతో యూరప్‌ మార్కెట్లు, కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ3(జులై-సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటనతో అమెరికా

Most from this category