News


బీపీసీఎల్‌కు రేటింగ్ డౌన్‌గ్రేడ్ ముప్పు

Friday 4th October 2019
news_main1570186469.png-28707

  • ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై మూడీస్‌ వ్యాఖ్యలు

ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్‌ బి మైనస్‌ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని, ఇది కంపెనీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ తెలిపింది. కొనుగోలు చేసే సంస్థ ప్రభుత్వ రంగంలోనిదా లేక ప్రైవేట్ కంపెనీయా అన్న దానిపై బీపీసీఎల్‌ క్రెడిట్ రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని మూడీస్ వెల్లడించింది. బీపీసీఎల్‌లో ఉన్న మొత్తం 53.29 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సెప్టెంబర్ 30న జరిగిన సమావేశంలో కార్యదర్శుల బృందం ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ప్రస్తుత షేరు ధరల ప్రకారం బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 57,500 కోట్ల పైగా ఉంటుంది. సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్లకు సంబంధించి బీపీసీఎల్‌ 1.7 బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. కంపెనీ ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బాగా లేదు. ఇలాంటప్పుడు విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి చెల్లించాల్సి వస్తే బీపీసీఎల్‌కు రీఫైనాన్సింగ్‌పరమైన రిస్కులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2019 మార్చి ఆఖరు నాటికి బీపీసీఎల్‌ దగ్గర రూ. 5,300 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉండగా.. వచ్చే 15 నెలల్లో రూ. 10,900 కోట్ల మేర రుణాలను చెల్లించాల్సి రానుంది. 



You may be interested

యస్‌ బ్యాంకు నుంచి రజత్ మోంగా నిష్క్రమణ

Friday 4th October 2019

ముంబై: మొండిబాకీలు తదితర సమస్యల్లో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ సీనియర్‌ గ్రూప్ ప్రెసిడెంట్‌, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ రజత్ మోంగా రాజీనామా చేశారు. ఇన్వెస్టర్లు, విశ్లేషకులతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో బ్యాంకు సీఈవో రవ్‌నీత్ గిల్‌ ఈ విషయం వెల్లడించారు. గడిచిన రెండేళ్లుగా బాధ్యతల భారం, ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన కొంతకాలం పాటు సెలవు తీసుకునే అంశం కూడా చర్చించినప్పటికీ, వైదొలగేందుకే మోంగా మొగ్గుచూపారని గిల్

పీఎంసీ కేసులో ఇరువురు హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

Friday 4th October 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్లర్లు ఇరువురు అరెస్ట్‌ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్‌ వాద్వాన్‌, ఆయన కుమారుడు సారంగ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల

Most from this category