News


బీపీసీఎల్‌ వాటా విక్రయంతో ఓఎంసీల రీరేటింగ్!

Thursday 21st November 2019
news_main1574328788.png-29762

నిపుణుల అంచనా
బీపీసీఎల్‌ ప్రైవేటేజేషన్‌తో మొత్తం ఓఎంసీ రంగం రీరేటింగ్‌ పొందే ఛాన్సుందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని అభిప్రాయపడ్డారు. కంపెనీలో వాటాల విక్రయానికి ప్రభుత్వం అధికారిక అనుమతినిచ్చింది. దీంతో ఈ రంగంలోని కంపెనీల నిజవిలువ మరింతగా బయటకు రానుందని జాని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో మార్కెట్‌కు వాటాల విక్రయంపై నమ్మకం కుదిరిందన్నారు. బీపీసీఎల్‌లో వాటాలతో పాటు యాజమాన్య నిర్వహణను సైతం ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో కంపెనీ కోసం హేమాహేమీలు పోటీ పడతాయని, ఇది రాబోయే కాలంలో ఓఎంసీలన్నింటికీ పెద్ద పాజిటివ్‌ చర్యగా మారుతుందని తెలిపారు. క్రమంగా ఈ కంపెనీలన్నీ రీరేటింగ్‌ పొందుతాయని అంచనా వేశారు. 
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ మొత్తం 3- 6నెలల్లో పూర్తి చేస్తే ప్రస్తుత విత్తసంవత్సరానికి భారీ సాయం అందినట్లేనని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీఐఓ సౌరవ్‌ ముఖర్జీ చెప్పారు. అయితే కంపెనీ సైజు పెద్దది కావడంతో అనుకున్నంత వేగంగా పనులు పూర్తవుతాయా? లేదా? చెప్పలేమన్నారు. ప్రపంచం నుంచి బడా ఇన్వెస్టర్లు ఈ డీల్‌పై ఆసక్తి చూపుతున్నాయన్నారు. ముఖ్యంగా రష్యా, సౌదీల నుంచి మంచి స్పందన ఉండొచ్చన్నారు. ప్రభుత్వం చెబుతున్న వాటాల ఉపసంహరణ మొత్తం పూర్తయితే దాదాపు రూ. 1- 1.5 లక్షల కోట్లు సమకూరవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం విత్త ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందని, పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ను కిందకు తీసుకువస్తుందని చెప్పారు. ఏడాదిన్నరగా ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తున్నా బ్యాంకులు పూర్తి స్థాయిలో కస్టమర్లకు రేట్ల తగ్గింపు అందించడం లేదని చెప్పారు. బాండ్‌ ఈల్డ్స్‌ దిగివస్తే రేట్లు ఆటోమేటిగ్గా దిగివస్తాయన్నారు. 



You may be interested

డిసెంబర్‌లో డెట్‌ ఈటీఎఫ్‌!

Thursday 21st November 2019

కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఆదాయాన్నిచ్చే ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)ను ఈ డిసెంబర్‌లో ప్రారంభించనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఈటీఎఫ్‌ పరిమాణం రూ. 15,000-20,000 కోట్లుగా ఉంటుందని, ఇందులో డెట్‌ సెక్యురిటీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయని వివరించారు. ‘పీఎస్‌యూ(ప్రభుత్వం రంగ సం‍స్థలు)లకు చెందిన ఏఏఏ రేటింగ్‌ పత్రాలను మాత్రమే ఈ ఫండ్‌ కలిగివుంటుంది. అంతేకాకుండా ఈ ఫండ్‌ ఏడు శాతం రిటర్న్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఇది పన్ను రేటు తగ్గిన

టీవీ నెట్‌వర్క్ 18 కొనుగోలుకు సోనీ ఆసక్తి..?

Thursday 21st November 2019

ముఖేశ్‌ అంబానీ నియంత్రణలోని టెలివిజన్‌ వ్యాపారంలో వాటాను కొనుగోలు చేసేందుకు జపాన్‌ దిగ్గజం సోనీ కార్ప్ ఆస్తకి చూపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ముఖేశ్‌ నేతృత్వంలోని నెట్‌వర్క్ 18 మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సోని ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో రోజురోజూకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా సోని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సోనీ

Most from this category