News


లిథియం బ్యాటరీల సరఫరాలో బీపీసీఎల్‌

Tuesday 4th February 2020
news_main1580786828.png-31484

  • కైనెటిక్‌, ఐఐటీ మద్రాస్‌లతో జట్టు

చెన్నై: ప్రభుత్వ రంగ చమురు తయారీ దిగ్గజం బీపీసీఎల్ తాజాగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల సరఫరా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్‌, ఐఐటీ మద్రాస్‌ (సాంకేతిక సహకారం)తో జట్టు కట్టింది. తొలి దశలో కొచి, లక్నోలోని తమ రిటైల్ అవుట్‌లెట్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు నగరాల్లో కైనెటిక్ గ్రీన్‌ సంస్థ ఈ-రిక్షాలు నిర్వహిస్తోంది. వాహనాలు వాడుకున్నందుకు గాను డ్రైవర్లు కొంత మొత్తం అద్దె చెల్లిస్తారు. అలాగే, చార్జింగ్ సదుపాయం కోసం బీపీసీఎల్‌కు కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో గంటల కొద్దీ చార్జింగ్ బాదరబందీ లేకుండా ఈ-రిక్షా డ్రైవర్లు.. బీపీసీఎల్‌ అవుట్‌లెట్స్‌లో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలకు బదులుగా తమ బ్యాటరీలను మార్చుకోవచ్చు. తదుపరి దశలో మరో ఏడు నగరాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కైనెటిక్‌, బీపీసీఎల్ చర్చలు జరుపుతున్నాయి. 
    రాబోయే రోజుల్లో ప్రజా రవాణా కోసం పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలకు మరింత డిమాండ్ ఉండగలదని ఈ సందర్భంగా బీపీసీఎల్‌ సీఎండీ డి. రాజ్‌కుమార్ తెలిపారు. మార్చుకోతగిన బ్యాటరీల టెక్నాలజీ కారణంగా ఎలక్ట్రిక్ వాహనం ఖరీదు 50 శాతం మేర తగ్గిపోతుందని కైెనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. ఈ-రిక్షాకు అవసరమయ్యే రెండు బ్యాటరీల ఖరీదు (సుమారు రూ. 60,000-65,000) బీపీసీఎల్ భరిస్తుంది. ఇవి 50-55 కి.మీ. మైలేజీ ఇస్తాయి. బ్యాటరీలను మార్చుకునేందుకు డ్రైవర్లు రూ. 350-450 యూసేజి ఫీజు కట్టాల్సి ఉంటుంది. బ్యాటరీ లేకుండా ఒక్కో ఈ-రిక్షాపై పెట్టుబడి దాదాపు రూ. 1 లక్ష ఉంటుందని, ప్రస్తుతం రెండు నగరాల్లో తలో 20 వాహనాలు అందుబాటులో ఉంచామని మోత్వాని వివరించారు. 



You may be interested

గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 4th February 2020

రూ.517 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.42 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.45 కోట్లకు పెరిగిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.431 కోట్ల నుంచి రూ.517 కోట్లకు

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?!

Tuesday 4th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌ సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌ అటూఇటుగా ఆసియా మార్కెట్లు నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు పుంజుకుని 11,745 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..

Most from this category