రిలయన్స్ పెట్రో రిటైలింగ్ వాటా కోసం బీపీ రూ.7000 కోట్ల చెల్లింపు
By Sakshi

బ్రిటన్ ఇంధన దిగ్గజ కంపెనీ రిలయన్స్ బీపీ లిమిటెడ్ ఫ్యూయెల్ రీటైలింగ్ నెట్‌వర్క్స్‌లో 49శాతం వాటా కొనుగోలుకు రూ.7000 కోట్లను చెల్లించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సోమవారం ప్రటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల ఏర్పాటుతో పాటు విమాన ఇంధనాన్ని కూడా విక్రయించేందుకు బీపీ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన కంపెనీ 42 ఏజీఎం సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ ‘‘ఇప్పటికే రిలయన్ ఇండస్ట్రీస్‌కు దేశవ్యాప్తంగా 1400 పెట్రోల్ బంకులతో పాటు 31 విమాన ఇంధన తయారీ స్టేషన్లు ఉన్నాయి. బీపీ లిమిటెడ్‌తో కలిసి ఏర్పాటు చేయబోయే కొత్త జాయింట్ వెంచర్‌కు ఇవన్నీ బదిలీ చేయబడతాయి. ఇందుకు గానూ బీపీ లిమిటెడ్ రూ.7000 కోట్లను రిలయన్స్‌కు చెల్లించనుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వచ్చే ఐదేళ్లతో రీటైల్ నెట్‌వర్క్‌ను 5500 పెట్రోల్ బంకులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ వెంచర్లో బీపీ లిమిటెడ్ 49శాతం వాటాను, మిగతా 51శాతం వాటాను రిలయన్స్ కలిగి ఉంటుంది’’ అని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బీపీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇది మూడో జాయింట్ వెంచర్ కావడం విశేషం. బీపీ లిమిటెడ్ 2011లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 ఆయిల్ గ్యాస్ ఆన్వేషణ, రిలయన్స్ ఉత్పత్తి విభాగంలో 30శాతం వాటాను 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశంలో ప్రస్తుతం 65000 పెట్రోల్ బంకులున్నాయి. ఇందుకులో అత్యధికంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 58714 ఒంకులున్నాయి. ఈ సంఖ్యను పెట్టింపు చేసుకునేందుకు ఆయా కంపెనీలు ఇప్పటికే డీలర్లను నియమించుకున్నాయి. రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆధ్వర్యంలోని నయరా ఎనర్జీకి దేశంలో 5,244 పెట్రోల్ బంకులున్నాయి. వచ్చే రెండు, మూడేళ్లలో వీటి సంఖ్యను 7000లకు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాయల్ డచ్ షెల్ కంపెనీకి 151 పెట్రోల్ బంకులుండగా వాటిని 200 పెంచుకోవాలని భావిస్తుంది. ఇక బీపీ లిమిటెడ్‌కు భారత్‌లో 2500 పెట్రోల్ బంక్‌ల నిర్వహణకు 2016లో ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అలాగే ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ సైతం భారత రీటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. అందుకు అదానీ గ్రూప్‌తో జతకట్టేందుకు చర్చలు జరుపుతోంది.
You may be interested
బుల్‌కాల్ స్ప్రెడ్ వ్యూహం బెటరు
Monday 12th August 2019నిపుణుల సూచన నిఫ్టీ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గతవారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన క్లోజయింది. వీఐఎక్స్ 19.4 స్థాయి నుంచి 16.25 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణి పైఅవధి వద్ద కదలాడుతోంది. ఈ వారం మార్కెట్ ట్రేడింగ్ దినాలు తక్కువ కావడంతో స్వల్పకాలిక కదలికలే ఉండొచ్చని నిపుణుల అంచనా. వీక్లీ నిఫ్టీ ఆప్షన్స్ పరిశీలిస్తే 11000 పాయింట్ల వద్ద పుట్స్, 11200, 11300 పాయింట్ల వద్ద కాల్స్
ట్రెండ్ రివర్సల్ సిగ్నలిస్తున్న లాంగ్- షార్ట్ నిష్పత్తి?!
Monday 12th August 2019కనిష్ఠస్థాయిలకు చేరడం అప్‌మూవ్‌కు సంకేతమంటున్న నిపుణులు ఆగస్టు సీరిస్‌లో ఎఫ్‌పీఐల ఇండెక్స్ లాంగ్- షార్ట్ నిష్పత్తి 0.48కు పడిపోయింది. గత ఏడేళ్లలో ఇలాంటి మార్పు కనిపించడం చాలా ఆరుదుగా జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిష్పత్తి పడిపోతూ కనిష్ఠాలకు చేరడం మార్కెట్‌కు దిగువస్థాయిల్లో మద్దతు దొరకడానికి సంకేతంగా, అప్‌మూవ్‌కు తొలిమెట్టుగా టెక్నికల్ అనలిస్టులు భావిస్తారు. ఆగస్టు డెరివేటివ్స్ ముగింపు నాటికి నిఫ్టీలో సరాసరిన దాదాపు 6 శాతం అప్‌మూవ్ ఉండొచ్చని ఈ