News


కేజీ-డీ6లో రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు

Thursday 18th July 2019
news_main1563431798.png-27147

  • 2022 నాటికి రిలయన్స్, బీపీ ప్రణాళిక

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటీష్ భాగస్వామ్య సంస్థ బీపీ 2022 నాటికి  రూ. 35 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. కేజీ-డీ6 బ్లాక్‌లో మూడు గ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు బీపీ సీఈవో (అప్‌స్ట్రీమ్ విభాగం) బెర్నార్డ్ లూనీ తెలిపారు. 2022 నాటికి కొత్తగా రోజుకు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ ఉత్పత్తి చేయగలమని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, మహానది బేసిన్‌లోని ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లో కూడా గ్యాస్ నిక్షేపాల వెలికితీత, సరఫరా ప్రణాళికలపై కూడా రిలయన్స్, బీపీ కసరత్తు చేస్తున్నట్లు లూనీ తెలిపారు. 
కేజీ-డీ6 బ్లాక్‌లో తలపెట్టిన మూడు ప్రాజెక్టుల్లో దాదాపు 3 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్‌0 గ్యాస్ వనరులు ఉన్నాయని అంచనా. వీటిలో అన్నింటికన్నా ముందు ఆర్‌-క్లస్టర్‌ ప్రాజెక్టులో 2020-21 ద్వితీయార్థం నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగలదని భావిస్తున్నారు. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 60 శాతం వాటాలు ఉండగా, 30 శాతం వాటాలతో బీపీ దానికి భాగస్వామ్య సంస్థగా ఉంది. ఈ బ్లాక్‌లో ఇప్పటిదాకా 19 నిక్షేపాలు గుర్తించగా, డీ1..డీ3 ప్రాజెక్టుల నుంచి 2009లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. 2010 మార్చిలో గరిష్టంగా రోజుకు 54 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) మేర ఉత్పత్తి జరిగిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం 1.3 ఎంసీఎండీకి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజా పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ లాభం 92 శాతం డౌన్‌

Thursday 18th July 2019

రూ.96 కోట్లకు నికర లాభం  భారీగా పెరిగిన మొండి బకాయిలు కేటాయింపులు కూడా అదే స్థాయిలో  ఇక ఇప్పటి నుంచి పుంజుకుంటాం విశ్వాసం వ్యక్తం చేసిన బ్యాంక్‌  ముంబై: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 92 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.1,260 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో  రూ. 96 కోట్లకు చేరిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.  మొండి బకాయిలు భారీగా

దివాలా కంపెనీలకు 330 రోజుల్లో పరిష్కారం

Thursday 18th July 2019

సత్వర పరిష్కారం దిశగా చర్యలు ఐబీసీ చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: దివాలా చట్టంలో ఏడు రకాల కీలక సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు, 2019కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కార్పొరేట్‌ పరిష్కార ప్రక్రియకు 330 రోజుల గడువును నిర్ణయించడం ఇందులో ప్రధాన సవరణ. ప్రస్తుతానికి ఈ గడువు 270 రోజులే ఉన్పపటికీ చాలా కేసుల్లో ఎక్కువ సమయమే తీసుకుంటోంది. దరఖాస్తులను

Most from this category