News


రూ.2,500 కోట్లు రికవరీ:బీవోఐ

Monday 19th August 2019
news_main1566194317.png-27857

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు రికవరీ అయ్యే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తోంది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ వద్ద 8-10 ఎన్‌పీఏ కేసులు పరిష్కారం కావొచ్చని బ్యాంకు ఈడీ సి.జి.చైతన్య తెలిపారు. తెలంగాణ జోనల్‌ మేనేజర్‌ ఎల్‌.మురళీ కృష్ణ రాజు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సి.శోభారాణితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులు పరిష్కారం అవడం వల్ల లాభాలకు రూ.1,500 కోట్లు జతకూడనున్నాయి. శాఖల విస్తరణ కంటే డిజిటైజేషన్‌పై అధికంగా ఫోకస్‌ చేస్తున్నాం. 2018-19లో రుణాలు 11 శాతం వృద్ధి చెందాయి. 2019-20లో రుణాల్లో 11-15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు.



You may be interested

ఐటీ రిటర్న్స్‌ దాఖలు ఆలస్యమైతే...

Monday 19th August 2019

నష్టాలకు క్యారీ ఫార్వార్డ్‌ ఉండదు ఇంటిపై నష్టాలకు మాత్రం మినహాయింపు జరిమానా చెల్లించుకోవాల్సి రావచ్చు ఆలస్యమైన కాలానికి పన్ను మొత్తంపై వడ్డీ గడువులోపు దాఖలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు తప్పులుంటే సవరణ రిటర్నులు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు విషయంలో అశ్రద్ధ వహించి గడువులోపు ఆ పనిచేయకపోతే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఈ లోపు దాఖలు చేయకపోతే పెనాల్టీ

ఈ వారానికి బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 19th August 2019

నిపుణుల సలహా నిఫ్టీ ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 10900- 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ బాగా పోగుపడినట్లు కనిపిస్తోంది. 11100, 11400 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11000 పాయింట్ల వద్ద మద్దతు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దగ్గర్లో గట్టి నిరోధం ఏమీ లేదని, అందువల్ల క్రమంగా 11200 నుంచి 11500 పాయింట్ల వరకు నిఫ్టీ ఎగబాకవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంకు నిఫ్టీలో సైతం పుట్‌

Most from this category