News


వృద్ధి 5.8 శాతానికి పడిపోవచ్చు

Tuesday 5th November 2019
news_main1572925809.png-29351

  • 2019-20పై బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్‌ అంచనాల సవరణ

ముంబై: ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నా కానీ, పండుగల సమయంలో డిమాండ్‌ పుంజుకోకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5.8 శాతానికి తగ్గిపోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బోఫాఎంఎల్‌) అంచనా వేసింది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే సమీక్షలో ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లను 0.15 శాతం మేర తగ్గిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికం (జూన్‌)లో జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. వినియోగ డిమాండ్‌ ఆశావహంగా లేకపోవడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది ఇంకా కనిష్ట స్థాయిని చేరొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘దురదృష్టకరం ఏమిటంటే ఇప్పటికీ రుణాలపై అధిక వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. దీనికితోడు దీపావళి సమయంలో డిమాండ్‌ ఊపందుకోకపోవడంతో 2020 ఆర్థిక సంవత్సరం జీవీఏ వృద్ది అంచనాలను 30 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించి 5.8 శాతానికి సవరిస్తున్నాం’’ అని బోఫాఎంఎల్‌ పేర్కొంది. ప్రస్తుత మందగమనం నుంచి బయటపడడానికి వడ్డీ రేట్ల తగ్గింపు ఒక్కటే మార్గంగా సూచించింది. 



You may be interested

రెండవ దశకు సిద్ధమైన ఐకేపీ

Tuesday 5th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ రెండో దశకు సిద్ధమైంది. సంస్థ 20వ వార్షికోత్సవాల్లో భాగంగా నవంబరు 8న భవిష్యత్‌ ప్రాణాళికను ప్రకటించనుంది. పరిశోధన రంగంలో విజయవంతమయ్యే కంపెనీల రూపకల్పన సంస్థ ప్రధాన ఉద్ధేశమని ఐకేపీ చైర్మన్‌ దీపాన్విత ఛటోపాధ్యాయ తెలిపారు. సీవోవో ప్రసాద్‌ ఎడె, చీఫ్‌ మేనేజర్‌ డి.విశ్వనాథంతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీలు మేధో సంపత్తి హక్కులను

మొబైల్ నెట్‌లో అట్టడుగున భారత్‌

Tuesday 5th November 2019

బ్రాడ్‌బ్యాండ్‌లో కొంత మెరుగైన ర్యాంకు ఊక్లా సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌ కన్నా భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను విశ్లేషించే ఊక్లా సంస్థ సెప్టెంబర్‌ నెలకు గాను నిర్వహించిన సర్వేలో భారత్‌ 128వ ర్యాంకులో నిల్చింది, శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్‌ 112వ స్థానం, నేపాల్‌ 119వ ర్యాంకులు దక్కించుకున్నాయి. అయితే, ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం ఈ

Most from this category