News


మారుతీ సుజుకీ వాహనాలకు బీఓబీ ఫైనాన్స్‌

Saturday 22nd June 2019
news_main1561178200.png-26493

  • ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తి

న్యూఢిల్లీ: డీలర్ ఇన్వెంటరీ, కస్టమర్ ఆటో రుణ ఫైనాన్స్‌ సేవలను పొందడం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో బీఓబీ తమ సంస్థకు ప్రాధాన్య ఫైనాన్షియర్ హోదాని పొందిందని వివరించింది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ రంగానికి చెందిన బీఓబీ మా కస్టమర్లు, డీలర్లకు నూతనతరం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవలను అందించనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. తాజా ఒప్పందం ద్వారా.. సమర్థత కలిగిన ఆటో లోన్, కమర్షియల్ ఫైనాన్స్ విభాగంలో సేవలను విస్తరించేందుకు అవకాశం లభించింది. ఈ విభాగంలో మా ఉనికిని బలపరిచేందుకు ఒప్పందం వీలుకల్పించిందని బీఓబీ ఎండీ అండ్‌ సీఈఓ పి ఎస్ జయకుమార్ అన్నారు.



You may be interested

ఆర్‌కామ్‌ ఆర్‌పీగా డెలాయిట్‌ నానావతి

Saturday 22nd June 2019

  వచ్చే నెల 23 కల్లా రిజల్యూషన్‌ ప్లాన్‌పై నివేదిక  ముంబై: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ దివాలా ప్రక్రియకు సంబంధించి రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌(ఆర్‌పీ)గా డెలాయిట్‌కు చెందిన అనీశ్‌ నానావతి నియమితులయ్యారు. ఆర్‌కామ్‌, దాని రెండు అనుబంధ సంస్థలు-రిలయన్స్‌ టెలికామ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ల దివాలా ​ప్రక్రియలకు కూడా ఆర్‌పీగా నానావతిని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) నియమించింది.  రిజల్యూషన్‌ ప్లాన్‌కు సంబంధించిన పురోగతి నివేదికను వచ్చేనెల 23 కల్లా సమర్పించాల్సిందిగా ఆర్‌పీని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది.

విధానం మార్పు రేట్ల కోటకు సంకేతమే

Saturday 22nd June 2019

నోమురా అంచనా ముంబై: ఆర్‌బీఐ తన విధానపరమైన వైఖరిని మార్చుకోవడం మరిన్ని రేట్ల కోత దిశగా సంకేతమేనని జపాన్‌ బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొంది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమావేశం వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ఆర్‌బీఐ తన విధానాన్ని సర్దుబాటుకు మార్చుకోవడం అంటే సమీప భవిష్యత్తులో రేట్ల పెంపు లేదన్నట్టు అర్థం చేసుకోవాలని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చివరి సమావేశం తర్వాత ప్రకటించిన విషయాన్ని

Most from this category