News


మార్కెట్లోకి బీఎండబ్ల్యూ కొత్త ఎం5 కాంపిటిషన్‌

Tuesday 8th October 2019
news_main1570511112.png-28771

- ధర రూ. 1.55 కోట్లు
- 3.3 సెకన్లలోనే సున్నా నుంచి 100కి.మీ

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ‘ఎం5 కాంపిటిషన్‌’ ప్రీమియం సెడాన్ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం 3.3 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకోగలదని ప్రకటించింది. దీని ధర రూ. 1.55 కోట్లు. సీబీయూ (కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌) తరహాలో.. ఈ నూతన వెర్షన్‌ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. నూతన వెర్షన్ లో 8-సిలిండర్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్‌సీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (డీబీసీ) స్పెసిఫికేషన్లుగా కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా బిఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రుద్రతేజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘భారత కస్టమర్ల ఆకాంక్ష, ఊహలకు తగిన విధంగా సంస్థ ఎం డివిజన్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేస్తుూనే ఉంటుందని’ అన్నారు.



You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Tuesday 8th October 2019

విజయదశమి సందర్భం‍గా మంగళవారం(అక్టోబర్‌ 8) మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. వీటితోపాటు ఫారెక్స్‌ మార్కెట్‌ కూడా పనిచేయదు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో మాత్రం సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా బుధవారం (9న) ప్రారంభమవుతుంది. కాగా గత సెషన్‌ చివరిలో ఫార్మా, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కొనసాగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్ల హోల్డింగ్‌ స్తంభన

Tuesday 8th October 2019

సీడీఎస్‌ఎల్‌ నిర్ణయం  క్యూ1 ఫలితాలు వెల్లడించలేకపోవడమే కారణం  న్యూఢిల్లీ: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌ను డిపాజిటరీ సంస్థ సీడీఎస్‌ఎల్‌ స్తంభింపజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇప్పటివరకూ వెల్లడించకపోవడమే దీనికి కారణమని సమాచారం. కాగా మరికొన్ని వారాల్లోనే ఆర్థిక ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఈ నెల 17న  బోర్డ్‌ మీటింగ్‌ను  ఏర్పాటు చేయనున్నామని

Most from this category