News


కాఫీడే టెక్‌ పార్క్‌ విక్రయానికి యస్‌ బ్యాంకు బ్రేక్‌!

Tuesday 10th December 2019
news_main1575949845.png-30143

బెంగళూరు: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్‌ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్‌ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్‌ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్‌ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్‌ పార్క్‌- బ్లాక్‌స్టోన్‌ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్‌ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ నడుస్తోంది. ఈ కంపెనీ యస్‌ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్‌ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600- 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్‌ బైండింగ్‌ ఒప్పందం చేసుకుంది. 



You may be interested

పెట్టుబడుల వృద్ధికే కార్పొరేట్‌ పన్ను కోత: సీఈఏ

Tuesday 10th December 2019

న్యూఢిల్లీ: పెట్టుబడులు పుంజుకోవడమే లక్ష్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని కేం‍ద్రం తీసుకున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన ఫిక్కీ యంగ్‌ లీడర్స్‌ సదస్సులో సుబ్రమణియన్‌ మాట్లాడుతూ... ఆర్థిక వృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు ఎంతో కీలకమైనవన్నారు. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించడం తెలిసిందే.

పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చే ముందు జాగ్రత్త

Tuesday 10th December 2019

ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ సూచన న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్లతో ఇన్వెస్టర్లు పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీవోఏ) ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్‌ఎస్‌ఈ హెచ్చరించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రూ.2,300 కోట్ల విలువైన తమ క్లయింట్ల సెక్యూరిటీలను తన ఖాతాలోకి మళ్లించి, వాటిపై రుణాలు పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కార్వీ క్లయింట్ల పీవోఏను దుర్వినియోగం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ

Most from this category