News


మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్‌

Thursday 12th September 2019
news_main1568260404.png-28326

  • ఇండియాబుల్స్‌ రియల్టీ కమర్షియల్‌ ప్రొపర్టీస్‌లో 
  • డీల్‌ విలువ రూ.4,420 కోట్లు !

ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్‌ ప్రొపర్టీస్‌లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌  గ్రూప్‌ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్‌ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్‌ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ ప్రొపర్టీస్‌లో 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది. 

రుణ రహిత కంపెనీగా...
రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నుంచి వైదొలగి పూర్తిగా ఆర్థిక సేవలపైననే దృష్టి కేంద్రీకరించే వ్యూహంలో భాగంగా ఇండియాబుల్స్‌ ఈ వాటాను విక్రయిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయం కారణంగా ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రుణ భారం భారీగా తగ్గనున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రుణరహిత కంపెనీగా నిలవాలని ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంలో భాగంగా వివిధ వ్యాపారాల్లో ఉన్న వాటాలను విక్రయిస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి ఈ కంపెనీ రుణ భారం రూ.4,420 కోట్లు, నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.739 కోట్లుగా ఉన్నాయని అంచనా. కాగా ఈ ఏడాది భారత్‌ రియల్టీ రంగంలో బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు 600 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా.



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 12th September 2019

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాఫ్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల లాభంతో 37,330 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,058 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌

Thursday 12th September 2019

నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌ డీలర్స్‌ సమావేశంలో మల్లారెడ్డి నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతీ సిమెంటు అభివృద్ధికి డీలర్స్‌ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్‌ వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతీ సిమెంట్‌ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్‌ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్‌ఫ్రూప్‌ ప్యాకింగ్, జర్మన్‌ టెక్నాలజీ వంటి వాటితో భారతీ సిమెంటు  వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు.  ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్‌

Most from this category