News


ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ పెట్టుబడులు

Saturday 16th November 2019
news_main1573875135.png-29627

  •  6 శాతం వాటా కొనుగోలు
  • డీల్‌ విలువ రూ.1,750 కోట్లు

న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌)లో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థ బ్లాక్‌స్టోన్‌ రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ హోల్డింగ్‌కంపెనీ రైకా కమర్షియల్‌ వెంచర్స్‌లో బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలోని ఫండ్స్‌ ఈ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ లావాదేవీలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌లో 6 శాతం వాటా బ్లాక్‌స్టోన్‌ పరమైంది. కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కారణంగా రైకాలో ఉన్న ఏకైక ఆర్థిక భాగస్వామిగా బ్లాక్‌స్టోన్‌ నిలిచింది. ఈ నిధులను రైకా సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తారు. 

బ్లాక్‌స్టోన్‌కు తొలి ‘ఫ్యాషన్‌’ పెట్టుబడి...
ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన సెంట్రల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ, ప్లానెట్‌ స్పోర్ట్స్‌  రిటైల్‌ చెయిన్స్‌ను ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ నిర్వహిస్తోంది. కాగా ఈ రంగంలో తమకు ఇది తొలి ఇన్వెస్ట్‌మెంట్‌ అని బ్లాక్‌స్టోన్‌ ఎమ్‌డీ లవ్‌ పారిఖ్‌ పేర్కొ‍న్నారు. మరోవైపు తమ ఫ్యాషన్‌ వ్యాపారం నిలకడగా వృద్ధి సాధిస్తోందని ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈఓ కిశోర్‌ బియానీ చెప్పారు. ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి బ్లాక్‌స్టోన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తోడ్పాటునందిస్తాయని వివరించారు. 
ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ 48 సెంట్రల్‌ స్టోర్స్‌ను, 100 బ్రాండ్‌ ఫ్యాక్టరీ అవుట్‌లెట్లను, 201 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. లీ కూపర్‌, ఇండిగో నేషన్‌, జెలస్‌ 21 వంటి 30కు పైగా ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.5,377 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 



You may be interested

డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ పెంపు శీతాకాల సమావేశాల్లోనే!

Saturday 16th November 2019

న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే, కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని

చెరో రూ.1,170 కోట్లు కట్టండి!

Saturday 16th November 2019

‘ర్యాన్‌బ్యాక్సీ’ సింగ్‌ సోదరులది కోర్టు ధిక్కారమే... దైచీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో షేర్ల అమ్మకం తగదని స్పష్టీకరణ ఎనిమిది వారాల్లో సొమ్ము కోర్టుకు జమచేయాలని ఆదేశం తరువాతే శిక్షను నిర్ణయిస్తామన్న సుప్రీం న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌లు (సింగ్‌ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ-

Most from this category