News


బిర్లా గ్రూప్‌ మూలపురుషుడు ఇకలేరు!

Thursday 4th July 2019
news_main1562223592.png-26786

  • పారిశ్రామిక కురువృద్ధుడు బీకే బిర్లా కన్నుమూత
  • నేడు అంత్యక్రియలు

ముంబై: బీకే బిర్లాగా అంతా పిలిచే బసంత్‌ కుమార్‌ బిర్లా ఇక లేరు. బిర్లా గ్రూప్‌ వ్యవస్థాపకుడైన బీకే బిర్లా బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. భారత పారిశ్రామిక రంగానికి పునాదులు వేసిన దిగ్గజాల్లో ఒకరిగా పేర్కొనే బిర్లా గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన 15వ సంవత్సరం నుంచీ ఆయన వ్యాపార కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. సెంచురీ టెక్స్‌టైల్స్ అండ్‌ ఇండస్ట్రీస్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినప్పటి నుంచీ వ్యాపార పరంగా తన ప్రత్యేకతలను కనబరుస్తూ వచ్చారు.
పారిశ్రామికవేత్తలుగా కుమార్తెలు...
బీకే బిర్లా  కుమార్తెలు మంజుశ్రీ ఖైతాన్‌ కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తుండగా, జయశ్రీ మెహతా జయశ్రీ టీ అండ్‌ ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీకే బిర్లా భార్య సరళా బిర్లా 2015లో తుదిశ్వాస విడిచారు. 1995లో ఆయన ఏకైక కుమారుడు ఆదిత్య విక్రమ్‌ బిర్లా కన్నుమూశారు. కాగా కోల్‌కతాలో గురువారం బీకే బిర్లా అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ వర్గాలు తెలియజేశాయి. వైద్య సేవల నిమిత్తం బీకే బిర్లాను ఆయన మనవడు కుమారమంగళం బిర్లా ముంబైకి తీసుకువచ్చారు. 
మరికొన్ని ముఖ్యాంశాలు ఇవీ...
- దాతృత్వానికి మారుపేరుగా ఉన్న ఘనశ్యామ్‌ దాస్‌ బిర్లా చిన్న కుమారుడు బికే బిర్లా. ఆయన 1921 జనవరి 12న జన్మించారు. 
- 15వ సంవత్సరం నాటికే బీకే బిర్లా పలు కంపెనీల్లో క్రియాశీల బాధ్యతలను చేపట్టారు. కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఆ సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 
- పత్తి, విస్‌కోస్‌, పాలియెస్టర్‌, నైలాన్‌ దారాలు, రిఫ్రాక్టరీ, పేపర్‌, షిప్పింగ్‌, టైర్‌ కార్డ్‌, ట్రాన్స్‌పరెంట్‌ పేపర్‌, స్పన్‌పైప్‌, సిమెంట్‌, టీ, కాఫీ,  రసాయనాలు, ఫ్లైవుడ్‌, ఎండీఎఫ్‌ బోర్డ్‌ వం‍టి పలు రంగాలపై ఆయన దృష్టి పెట్టారు. 
- ప్రస్తుతం బీకే బిర్లా గ్రూప్‌లో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌తో పాటు సెంచురీ టెక్స్‌టైల్స్‌, సెంచురీ యెంకా, జయశ్రీ టీ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. 
- కృష్ణార్పణ్‌ చారిటీ ట్రస్ట్‌ చైర్మన్‌గా కూడా బీకే బిర్లా పనిచేశారు. రాజస్తాన్‌లోని పిలానీలో బీకే బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ పేరుతో ఒక ఇంజనీరింగ్‌ కళాశాలను ఈ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 25 విద్యా సంస్థల నిర్వహణలోనూ ట్రస్ట్‌ ప్రధాన భూమికను నిర్వహిస్తోంది. You may be interested

విద్యుత్‌ పంపిణీ ప్రయివేటుకు?

Thursday 4th July 2019

మరిన్ని పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణ 200 బొగ్గు, బాక్సైట్‌, కాపర్‌ గనుల వేలం ప్రధానితో సమావేశంలో ఆర్థికవేత్తల సూచనలు వీటిపై చర్యలకు మంత్రిత్వ శాఖలకు సిఫారసు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు చేసిన సూచనలకు కదలిక వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 22న వివిధ రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలైన టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఐటీసీ సీఎండీ

ఏడాది గరిష్ఠానికి 18 షేర్లు

Thursday 4th July 2019

ఎన్‌ఎస్‌ఈ గురువారం(జులై 4) ఇంట్రాడే ట్రేడింగ్‌లో సుమారుగా 18 స్టాకులు తమ ఏడాది గరిష్ఠాన్ని తాకాయి. అదానీ పవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజస్‌, మంధాన ఇండస్ట్రీస్‌, ఓబెరాయ్‌ రియాల్టి స్టాకులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఆర్‌ఈసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, సైమెన్స్‌ అండ్‌ టొరంటో పవర్‌ స్టాకులు కూడా తమ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 0.26 శాతం

Most from this category