News


ఎల్‌టీసీజీ రద్దుకు బీజేపీ మద్దతు

Thursday 30th January 2020
news_main1580356706.png-31318

దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ నిధుల వరద పెంచేందుకు మార్కెట్‌వర్గాలు కోరుతున్న పన్ను సవరణలు తీసుకురావాలని భారతీయ జనతాపార్టీ తమ ప్రభుత్వాన్ని కోరింది. ఈక్విటీ మార్కెట్‌ రిటర్న్స్‌పై పన్ను నిబంధనల సవరణలు తీసుకురావాలని పార్టీ సీనియర్‌ నాయకులు కోరారు. ఈక్విటీ పెట్టుబడులు, రాబడులపై ఎల్‌టీసీజీ(దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను)ను ఎత్తివేయాలని, డీడీటీ(డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌)ను సవరించాలని మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో 10 శాతం ఎల్‌టీసీజీ, 15 శాతం డీడీటీ వసూలు చేస్తున్నారు. ఈ రెండు పన్నులు దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడుల రాకను తగ్గిస్తున్నాయని ప్రీబడ్జెట్‌ సమావేశాల్లో పలు వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఇదే సమయంలో ఈ వర్గాల డిమాండ్‌ సమంజసమేనని, ఈ డిమాండ్లను పట్టించుకోవాలని అధికార బీజేపీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. ఈ పన్నుల కారణంగా పెట్టుబడుల్లో ఎక్కువ శాతం సింగపూర్‌, లండన్‌, హాంగ్‌కాంగ్‌లకు తరలిపోతున్నాయన్నారు. 14 ఏళ్ల తర్వాత 2018లో ఎల్‌టీసీజీని పునఃప్రవేశపెట్టారు. రెండేళ్లుగా మార్కెట్‌ వర్గాలు దీన్ని తీసివేయాలంటూ కోరుతున్నాయి. వీటిని తీసివేయడం, తగ్గించడం వల్ల ప్రభుత్వంపై పెద్ద భారం పడబోదని గోపాలకృష్ణ చెప్పారు. ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 



You may be interested

12100 దిగువన నిఫ్టీ ప్రారంభం

Thursday 30th January 2020

అంతర్జాతీయ మార్కెట్లను బలహీన సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 134 పాయింట్లను కోల్పోయి 41,064.09 వద్ద, నిఫ్టీ 32.45పాయింట్ల నష్టంతో 12100 దిగువన 12,097.05 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క రియల్టీ, అటో షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలక బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

యథాతథ పాలసీ అమలుకే ఫెడ్‌ ఓటు

Thursday 30th January 2020

ఉపాధి గణాంకాలు పటిష్టంగానే ఉన్నాయ్‌ నిరుద్యోగిత కనిష్ట స్థాయిలవద్దే నమోదవుతోంది ప్రస్తుతం వడ్డీ రేట్లను సవరించవలసిన అవసరంలేదు - ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ  అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. బుధవారం ముగిసిన రెండు రోజుల పాలసీ సమావేశాల్లో భాగంగా ఫండ్స్‌ రేట్లను 1.5-1.75 శాతం వద్దే అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ)

Most from this category