News


జీఎస్‌టీ వ్యత్యాసాలను వార్షిక రిటర్నుల్లో చెప్పాల్సిందే

Thursday 4th July 2019
news_main1562224397.png-26788

  • ఆర్థిక శాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: జీఎస్‌టీకి సంబంధించి నెలవారీ అమ్మకాల రిటర్ను ఫారం, విక్రయ గణాంకాలకు మధ్య వ్యత్యాసాలు ఉన్న పక్షంలో వార్షికంగా దాఖలు చేసే ఫారంలో కచ్చితంగా వెల్లడించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కట్టాల్సిన పన్ను బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. సాధారణంగా జీఎస్‌టీఆర్‌-1 కింద విక్రయ వివరాలు, జీఎస్‌టీఆర్‌-3బీ కింద అన్ని లావాదేవీలు, చెల్లింపుల వివరాలను సమగ్రంగా దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, వార్షిక రిటర్ను దాఖలు చేసేటప్పుడు ఈ రెండింటిలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందన్న పరిశ్రమ వర్గాల సందేహాలను నివృత్తి చేస్తూ ఆర్థిక శాఖ తాజా వివరణనిచ్చింది. జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-3బి, ఖాతాలు అన్నింట్లో కూడా గణాంకాలు సరిపోలాలని పేర్కొంది. ఒకవేళ తేడాలు వస్తే.. పన్ను కట్టకపోవడమో లేదా అధిక పన్ను చెల్లింపులు జరిపినట్లో భావించాల్సి వస్తుందని వివరించింది. 



You may be interested

మార్కెట్లోకి ‘ఎల్‌జీ’ సీలింగ్‌ ఫ్యాన్లు

Thursday 4th July 2019

ప్రారంభ ధర రూ.13,990 వై-ఫైతో నియంత్రించగలిగిన టెక్నాలజీ చెన్నై: దక్షిణ కొరియాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ.. ‘సీలింగ్ ఫ్యాన్’ విభాగంలోకి ప్రవేశించింది. తొలుత చెన్నైలో విక్రయాలను ప్రారంభించింది. ప్రీమియం శ్రేణిలో మొత్తం ఐదు ఫ్యాన్లను ఇక్కడ విడుదల చేయగా.. వీటి ప్రారంభ ధర రూ.13,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలోని ఎల్‌జీ ఇండియా ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తోంది. వై- ఫై

విద్యుత్‌ పంపిణీ ప్రయివేటుకు?

Thursday 4th July 2019

మరిన్ని పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణ 200 బొగ్గు, బాక్సైట్‌, కాపర్‌ గనుల వేలం ప్రధానితో సమావేశంలో ఆర్థికవేత్తల సూచనలు వీటిపై చర్యలకు మంత్రిత్వ శాఖలకు సిఫారసు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు చేసిన సూచనలకు కదలిక వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 22న వివిధ రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలైన టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఐటీసీ సీఎండీ

Most from this category