STOCKS

News


ప్రభుత్వ సాయం రాకుంటే ఐడియా దివాలా పిటిషన్‌!

Thursday 14th November 2019
Markets_main1573708219.png-29581

కొత్త నిధులు అందించేందుకు బిర్లాల విముఖత
టెలికం రంగానికి ప్రభుత్వ సాయం అందకుంటే వొడాఫోన్‌ ఐడియాను దివాలాకు వదిలేయాలని బిర్లాలు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితుల్లో వీఐఎల్‌లోకి కొత్తగా నిధులేమీ అందించకూడదని బిర్లా గ్రూప్‌ నిర్ణయించుకుందని తెలిపాయి. టెలికం వ్యాపారం లాభసాటిగా లేదని, ఈ వ్యాపారం అస్థిరంగా మారిందని, గ్రూప్‌ లాభాలకు గుదిబండలాగా తయారైందని, ఈ నేపథ్యంలో మరిన్ని నిధులు ఈ వ్యాపారంపై పెట్టాల్సిన అవసరం లేదని గ్రూప్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈఓ నిక్‌ రెడ్‌ తాజా కామెంట్లతో బిర్లా గ్రూప్‌ ఏకీభవిస్తోందని గ్రూప్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు. ప్రభుత్వ సాయం లేకుంటే వ్యాపారం మూసుకోవాల్సిందేనని రెడ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలు వక్రీకరించారని, భారత్‌లో వ్యాపారం కొనసాగించడమే తమకు మక్కువని రెడ్‌ మరలా మాటమార్చారు. మరోవైపు రెడ్‌ వ్యాఖ్యలు, బిర్లాల విముఖత తదితర కారణాలతో గురువారం వీఐఎల్‌ షేరు భారీగా పతనమై రూ. 2.85 ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది. గురువారం కంపెనీ క్యు2 ఫలితాలు విడదల చేయనుంది. 


బ్యాంకుల్లో నో రెస్పాన్స్‌
సుప్రీం కోర్టు తీర్పుతో వీఐఎల్‌ నెత్తిన రూ. 28 వేల కోట్ల భారం పడనుంది. ఈ మొత్తానికి మరో రూ.11వేల కోట్ల స్పెక్ట్రం వాడుక చార్జీల బకాయి, వడ్డీలు, జరిమానాలు కలిపితే తడిసిమోపెడు కానుంది. ప్రస్తుతం కంపెనీ నెత్తిన రూ. 99వేల కోట్ల రుణభారం ఉంది. క్యు1లో కంపెనీ రూ. 5వేల కోట్ల నష్టం ప్రకటించింది. నగదు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ గత నెల కూడా అరడజను బ్యాంకులను సంప్రదించినట్లు తెలిసింది. కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సాయం తీసుకునేందుకు చర్చలు జరిపాయి. కానీ అటు ఇన్వెస్టర్ల నుంచి కానీ, ఇటు బ్యాంకుల నుంచి కానీ ఎటువంటి పాజిటివ్‌ స్పందన కనిపించలేదు. మరోవైపు ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా పలువురు ప్రభుత్వాధికారులను కలిసి ఉపశమన చర్యల కోసం యత్నిస్తున్నారు. క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నుంచి ఏజీఆర్‌ బకాయిల విముక్తి, టారిఫ్‌ల పెంపుదలకు యంంత్రాంగం లాంటి చర్యలను వీఐఎల్‌ ఆశిస్తోంది. కానీ కమిటీ కేవలం ఏజీఆర్‌ తగ్గింపు, బకాయిల చెల్లింపుపై మారిటోరియం వంటి చర్యలనే రికమండ్‌ చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గట్టి తోడ్పాటు రాకుంటే వీఐఎల్‌ మూసివేత తప్పదని, అప్పుడు టెలికం రంగం రెండు ప్రైవేట్‌ కంపెనీల క్షేత్రంగా మారుతుందని సంబంధిత నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. You may be interested

రెడ్‌మి నోట్ 8 ఫ్లాష్ సేల్ ప్రారంభం

Thursday 14th November 2019

ప్రముఖ చైనా కంపెనీ షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 క్రితం నెలలో  ఇండియాలో విడుదల అయింది. గత నెలలో లాంచ్ అయినప్పటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్స్ ద్వారా మాత్రమే లభిస్తున్నాయి. అందులో భాగంలో మరొక ఫ్లాష్ సేల్స్‌ ఆఫర్‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానునుంది. బడ్జెట్‌ ఫోన్‌గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌లైన అమెజాన్‌, ఫ్లిఫ్‌ కార్ట్‌,

నీతా అంబానీకి అరుదైన గౌరవం..

Thursday 14th November 2019

ది మెట్రోపాలియన్ మ్యూజియం బోర్డులో చోటు న్యూయార్క్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ (ది మెట్‌)’ బోర్డులో ఆమె చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ది మెట్ అంతర్జాతీయ మండలిలో నీతా అంబానీ సభ్యురాలు. తాజాగా గౌరవ ట్రస్టీగా

Most from this category