News


బోర్డునుంచి తప్పుకున్న బిల్‌ గేట్స్‌!

Saturday 14th March 2020
news_main1584172064.png-32481

మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ బోర్డునుంచి తప్పుకుంటున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్ల బోర్డు, బర్క్‌షైర్‌ హాతవే బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్‌గేట్స్‌ తెలిపారు.64 ఏళ్ల బిల్‌గేట్స్‌ భార్యతో కలిసి ప్రారంభించిన బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారోగ్యం, అభివృద్ధి,విద్య, పర్యావరణ మార్పులపై పోరాడటం వంటి దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. బెర్క్‌షైర్‌ కంపెనీలు కానీ, మైక్రోసాఫ్ట్‌ కానీ ఎప్పుడూ లేనంత పటిష్టంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయమని గేట్స్‌ వివరించారు. 

గేట్స్‌తో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా
గేట్స్‌ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదేళ్ల స్పందిస్తూ.. ఇన్నాళ్లు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులతో కలసి పనిచేయడం ఎంతో గొప్పగా, గర్వంగా భావిస్తున్నాని చెప్పారు. సమాజంలోని సవాళ్లను పరిష్కరించాలన్న లక్ష్యంతో బిల్‌ మైక్రోసాఫ్ట్‌ని స్థాపించారు. ఆయన నాయకత్వం వల్ల సంస్థకు ఎంతో లబ్థి చేకూరింది. సాంకేతిక పట్ల ఆయనకున్న విజన్‌ను కంపెనీ ఇంకా వినియోగించుకోబోతోందని, సంస్థకు బిల్‌గేట్స్‌ సాంకేతిక సలహాదారుగా కొనసాగుతారని సత్య నాదేళ్ల వెల్లడించారు.

13 ఏళ్లకే కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా..
విలియం హెన్రీ గేట్స్‌, మేరీ దంపతులకు వాషింగ్టన్‌లోని సీయాటెల్‌లో 1955 అక్టోబర్‌ 28న బిల్‌ గేట్స్‌ జన్మించారు. బిల్‌గేట్స్‌ తండ్రి విలియం అట్రార్నిగా పనిచేయగా, తల్లి స్కూల్‌ టీచర్‌గా పనిచేయడమేగాక, యూనైటెడ్‌ వే ఇంటర్నేషనల్‌కు చైర్‌ ఉమెన్‌గా పనిచేశారు.  గేట్స్‌కు  13 ఏళ్లున్నప్పుడే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ చేయడం ప్రారంభిచారు. అప్పటి నుంచే ఆయన కంప్యూటర్లను అమితంగా ప్రేమించేవారు. ఆతరువాత ఆయన హర్వర్డ్‌ యూనివర్సిటీలో చదువును మధ్యలోనే ఆపేసి తన బాల్య స్నేహితుడు దివంగత అలెన్‌ పాల్‌తో కలిసి  1975లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీని స్థాపించారు. అక్కడి నుంచి పర్సనల్‌ కంప్యూటర్‌ రంగంలో ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా ఎదిగింది. ఆ తరువాత కొన్నేళ్లకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి మానవత్వంతో కూడిన దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు బిలీయనీర్‌ బిల్‌గేట్స్‌. కాగా బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పూర్తిస్థాయి విధుల నుంచి 2000 సంవత్సరంలో తప్పుకోగా, 2014వరకూ చైర్మన్‌గా కొనసాగారు. అప్పటి నుంచి బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన తాజా నిర్ణయంతో బోర్డు నుంచికూడా నిష్ర్కమించారు.You may be interested

నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 టాప్‌టెన్‌ లూజర్లు ఇవే..!

Saturday 14th March 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా గడచిన నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ ఏకంగా 21.50శాతం నష్టాన్ని చవిచూసింది. పతనమైన షేర్లలో అత్యధికంగా టాటా కెమికల్స్‌ షేరు అత్యధికంగా 63.77శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సూచీలో ఒక్కషేరు కూడా ఇన్వెస్టర్లకు లాభాల్ని సమకూర్చలేకపోవడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టబడుల సంహరణ, దివాళా దిశగా సాగుతున్న

యస్‌ బ్యాంక్‌ విత్‌డ్రాయిల్‌ పరిమితి 18న ఎత్తివేత!

Saturday 14th March 2020

పునరుద్ధరణ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్‌ బ్యాంక్‌ సీఈవోగా ప్రశాంత్‌ కుమార్‌ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికలకు కేంద్ర కేబినెట్‌ గ్రీస్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ కుమార్‌ సీఈవో, ఎండీగా ఎంపికయ్యారు. స్టేట్‌బ్యాంక్‌ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్‌ బ్యాంక్‌ పాలనాధికారిగా రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. పీఎన్‌బీ మాజీ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతాను యస్‌

Most from this category