News


నేను చేసిన పెద్ద తప్పు అదే !

Wednesday 26th June 2019
news_main1561534331.png-26583

  • ఆండ్రాయిడ్‌కు ధీటైన ఓఎస్ తేలేకపోయా 
  • మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌

వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్‌కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్‌కు ధీటైన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్‌ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్‌ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ, విలేజ్‌ గ్లోబల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 
అన్నీ ఆండ్రాయిడ్‌ ఫోన్లే...
యాపిల్‌ ఫోన్లు కాకుండా మిగిలిన ఇతర ఫోన్లకు ప్రామాణిక ప్లాట్‌ఫాంగా ఆండ్రాయిడ్‌ అవతరించిందని, మైక్రోసాఫ్ట్‌ ఆ స్థానంలో ఉండాల్సిందని ఆయన వివరించారు. గూగుల్‌ కంపెనీ ఆండ్రాయిడ్‌ను 2005లోనే కొనుగోలు చేసింది. ఐఫోన్‌ 2007లో మార్కెట్లోకి రాగా, ఆండ్రాయిడ్‌ ఫోన్‌2008లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 85 శాతానికి పైగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఉన్నవే. ఇక విండోస్‌ ఓఎస్‌తో తయారైన ఫోన్‌లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. 



You may be interested

ఆ మూడు లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

Wednesday 26th June 2019

నిధుల బదిలీ మూడేళ్లపాటు జరగొచ్చు కేంద్రానికి ఆర్‌బీఐ నిధులపై నొముర అంచనా బ్యాంకులకిస్తేనే బాగుంటుందన్న బీఓఏ-ఎంఎల్‌ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నోమురా అంచనా వేసింది. నోమురా దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్‌బీఐ నుంచి నిధుల బదలాయింపు

జీవిత బీమా తప్పనిసరి!!

Wednesday 26th June 2019

బజాజ్‌ అలియాంజ్‌ సర్వేలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా కలిగి ఉండటమనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ అధ్యయనంలో తేలిందని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా లైఫ్‌ గోల్స్‌ పేరుతో పలు నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 1,681 మంది సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో 60 శాతం మంది జీవిత బీమాను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Most from this category