News


ట్రంప్‌ పర్యటనలో భారీ ఆయిల్‌ డీల్‌ ?

Wednesday 19th February 2020
news_main1582106162.png-31935

అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 24న భారత్‌ రానున్న నేపథ్యంలో ఏయే రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే క్రూడ్‌ ఆయిల్‌ డీల్‌ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక అమెరికాలోని అతిపెద్ద ఆయిల్‌ సరఫరా కంపెనీలు ఇండియాలో భారీ దిగుమతులకు ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో బ్యారెల్‌పై 5 డాలర్ల డిస్కౌంట్‌ ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటిదాక భారత్‌ దుబాయ్‌ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే దుబాయ్‌ఇచ్చే ధరకంటే ఆమెరికా కంపెనీలు తక్కువ ధరకు క్రూడ్‌ను విక్రయిస్తాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులుకు ఉన్న క్రెడిట్‌ పిరియడ్‌ను అమెరికా కంపెనీలు 60-90 రోజుల వరకు పొడిగించే అవకాశము లేకపోలేదు.  



You may be interested

నెల రోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Wednesday 19th February 2020

వచ్చే నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. 1. డా.రెడ్డీస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3380. స్టాప్‌లాస్‌ రూ. 3230. ఏడాదిన్నరగా క్రమానుగత అప్‌మూవ్‌ చూపుతోంది. రూ. 1900 వద్ద మద్దతు జోన్‌ ఏర్పరుచుకుంది. తాజాగా రెండు వారాల కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ చూపింది. దీంతో మరో అప్‌మూవ్‌కు సిద్ధమైన సంకేతాలు ఇస్తోంది. 2. సిప్లా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 415. స్టాప్‌లాస్‌ రూ. 450.

వెల్లువెత్తుతున్న లిక్విడిటీతోనే మార్కెట్‌ ర్యాలీ

Wednesday 19th February 2020

ప్రపంచ వడ్డీ రేట్లు తగ్గే చాన్స్‌ తక్కువే పసిడి ధరలు మరింత పెరగకపోవచ్చు సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియావంటి ప్రత్యామ్నాయాలవైపు విదేశీ ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే ఇక్కడ కూడా ఈక్విటీల పోలిస్తే ఇతర సాధనాలలో పెద్దగా పెట్టుబడి అవకాశాలు కనిపించడంలేదు. దీంతో దేశీ మార్కెట్లు లిక్విడిటీ కారణంగా ర్యాలీ చేస్తున్నాయంటున్నారు సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌

Most from this category