News


సింగపూర్‌లోనూ భీమ్ యాప్‌

Thursday 14th November 2019
news_main1573705119.png-29578

సింగపూర్‌: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌.  అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ జావేద్ అష్రాఫ్‌... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను  (ఎస్‌జీక్యూఆర్‌) స్కాన్‌ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్‌ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్‌ (సింగపూర్‌) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్‌ పేర్కొన్నారు.  



You may be interested

భెల్‌ లాభం 42 శాతం అప్‌

Thursday 14th November 2019

రూ.121 కోట్లకు నికర లాభం  తొలి ఆర్నెల్లలో మాత్రం రూ.98 కోట్ల నష్టాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360

ప్రభుత్వానికి వొడాఫోన్‌ సీఈఓ క్షమాపణ!

Thursday 14th November 2019

తమ కంపెనీ జాయింట్‌ వెంచర్‌(వొడాఫోన్ ఐడియా) గురించి చేసిన వ్యాఖ్యలకు వొడాఫోన్‌ సీఈఓ నిక్‌రెడ్‌ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని వివరించారు. తన వార్తల కవరేజ్‌ తన అభిప్రాయాన్ని సరిగా వ్యక్తీకరించలేదన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి, టెలికం మంత్రికి లేఖ రాశారు. భారత్‌లో వ్యాపారం కొనసాగించాలన్న తమ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తమ ఇబ్బందులపై పరిశీలన జరిపేందుకు కార్యదర్శులతో కూడిన

Most from this category