News


భెల్‌ ఆదాయం రూ.5,828 కోట్లు

Wednesday 12th February 2020
news_main1581476749.png-31706

  • 17 శాతం తగ్గిన నికర లాభం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్‌ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.322 కోట్లుగా ఉంది. You may be interested

ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.5,763 కోట్లు

Wednesday 12th February 2020

రూ.6,216 కోట్లకు మొత్తం ఆదాయం  రూ.25,000 కోట్లకు పెరిగిన ఆధీకృత మూలధనం  న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.4,185 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే క్వార్టర్‌లో రూ.5,763 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.6,191 కోట్ల నుంచి రూ.6,216 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రమోట్‌ చేస్తున్న ఐడీబీఐ

కోల్‌ ఇండియా లాభం రూ.3,922 కోట్లు

Wednesday 12th February 2020

కోల్‌కత: మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 14 శాతం పతనమై రూ.3,922 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.23,385 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.21,566 కోట్లకు చేరాయని కోల్‌ ఇండియా తెలిపింది. మొత్తం సమగ్ర ఆదాయం రూ.4,140 కోట్ల నుంచి రూ.3,670 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఇంధన సరఫరా ఒప్పందం(ఎఫ్ఎస్‌ఏ) ప్రకారం

Most from this category