News


భెల్‌ లాభం 25శాతం అప్‌

Wednesday 6th February 2019
news_main1549431010.png-24044

  • 25 శాతం పెరిగిన భెల్‌ లాభం
  • ఒక్కో షేర్‌కు 80 పైసల మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.192 కోట్లకు పెరిగిందని భెల్‌ తెలిపింది. ఆదాయం రూ.6,666 కోట్ల నుంచి 10 శాతం ఎగసి రూ.7,336 కోట్లకు పెరిగిందని భెల్‌ సీఎమ్‌డీ అతుల్‌ సోబ్తి పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు 80 పైసల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నామని,  ఈ నెల 21లోపు డివిడెండ్‌ చెల్లిస్తామని తెలిపారు. ఎబిటా రూ.265  కోట్ల నుంచి 18 శాతం తగ్గి రూ.219 కోట్లకు చేరిందని వివరించారు. ఇతర ఆదాయం రూ.168 కోట్ల నుంచి రూ.27 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఈ క్యూ3లో మంచి పనితీరు సాధించామని సోబ్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించడం, ప్రాజెక్ట్‌ల ఆచరణను వేగవంతం చేయడం, వ్యయ నియంతణ పద్ధతులు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం....ఈ  వ్యూహాల కారణంగా ఈ స్థాయి పనితీరు సాధించామని తెలిపారు. విద్యుత్తు రంగంలో ​‍అగ్రస్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా విద్యుత్తేతర రంగంలో కూడా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నామని వివరించారు.You may be interested

అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు

Wednesday 6th February 2019

హెచ్‌పీసీఎల్‌కు ‘ఇన్వెంటరీ’ నష్టాలు న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 87 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,950 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.248 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌ కె సురానా తెలిపారు.  నికర

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,203 కోట్లు

Wednesday 6th February 2019

-15 శాతం వృద్ధితో రూ.8,944 కోట్లకు మొత్తం ఆదాయం -21 శాతం పెరిగిన ఎబిటా -భవష్యత్తులో మార్జిన్లపై ఒత్తిడి న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,203 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.9,43 కోట్ల నికర లాభం వచ్చిందని, 28 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఆటోమేషన్‌ కారణంగా లాభ మార్జిన్‌ పెరిగిందని కంపెనీ

Most from this category