News


భెల్‌ లాభం 42 శాతం అప్‌

Thursday 14th November 2019
news_main1573705252.png-29579

  • రూ.121 కోట్లకు నికర లాభం 
  • తొలి ఆర్నెల్లలో మాత్రం రూ.98 కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360 కోట్లకు తగ్గింది. ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీకి నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలానికి రూ.125 కోట్ల నికర లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.98 కోట్ల నికర నష్టాలు (కన్సాలిడేటెడ్‌) వచ్చాయని భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,050 కోట్ల నుంచి రూ.11,033 కోట్లకు తగ్గిందని పేర్కొంది. 



You may be interested

నీతా అంబానీకి అరుదైన గౌరవం..

Thursday 14th November 2019

ది మెట్రోపాలియన్ మ్యూజియం బోర్డులో చోటు న్యూయార్క్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ (ది మెట్‌)’ బోర్డులో ఆమె చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ది మెట్ అంతర్జాతీయ మండలిలో నీతా అంబానీ సభ్యురాలు. తాజాగా గౌరవ ట్రస్టీగా

సింగపూర్‌లోనూ భీమ్ యాప్‌

Thursday 14th November 2019

సింగపూర్‌: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌.  అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ జావేద్ అష్రాఫ్‌... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను  (ఎస్‌జీక్యూఆర్‌) స్కాన్‌ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్‌ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి

Most from this category