News


వచ్చే ఐదేళ్లలో ఈ 4కంపెనీల ప్రైవేటీకరణ: సీఎల్‌ఎస్‌ఏ

Saturday 30th November 2019
news_main1575108439.png-29982

వచ్చే ఐదేళ్లలో భెల్‌, గెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, నాల్కో కంపెనీల ప్రైవేటీకరణ జరగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ భావిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సీఎల్‌ఎస్‌ అంచనా వేస్తుంది. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా వంటి పెద్ద పీఎస్‌యూల ప్రైవేటీకరణకు అవకాశం తక్కువవుండటంతో ఈ  పీఎస్‌యూ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. గడిచిన మూడేళ్లలో ఈటీఎఫ్‌ల ద్వారా ప్రభుత్వరంగ షేర్ల విక్రయం ద్వారా కేంద్రం 12 బిలియన్ డాలర్లు సంపాదించింది. ఈ రకమైన అమ్మకాలు నాన్‌-డిజిఇన్వెస్టమెంట్‌ కంపెనీలపై మార్కెట్లో సరఫరా ఒత్తిడిని కలిగిస్తాయి. ‘‘ప్రైవేటీకరణ అనేది సమయం తీసుకునే ప్రక్రియ. గ్లోబల్ టెండర్, ఒప్పంద కమ్యూనికేషన్‌ మధ్య కాలవ్యవధికి 6 నుంచి 16 నెలలు పడుతుంది. ఆర్థిక సంవత్సరం 2001-2002 ముందు జరిగిన 3 విజయవంతమైన ప్రైవేటీకరణ అనుభవాలను పరిగణలోకి ఈ విషయం అవగతవుతోంది. ఈ తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ అనేది కేంద్రానికి సవాలుగా మారుతుందని అని బ్రోకరేజ్ తెలిపింది. పన్ను వసూళ్ల వృద్ధి బలహీనంగా ఉండటం, కేంద్ర ప్రకటించిన ఉద్దీపన చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల కోట్ల లోటు ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 3.3% ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.  ఎక్కువ పన్నుల తగ్గింపు జరిగితే, ఇతర పన్నుయేతర ఆదాయ వనరులు ఇప్పటికే తగ్గినందున, ప్రైవేటీకరణ లక్ష్యం ముందుకు సాగవచ్చని బ్రోకరేజ్ అభిప్రాయపడింది.



You may be interested

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీఓ సోమవారమే!

Saturday 30th November 2019

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ(స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫ్‌ర్‌(ఐపీఓ) సోమవారం దలాల్‌ స్ట్రీట్‌లోకి రానుంది. ఈ ఎస్‌ఎఫ్‌బీ రూ. 303.75 కోట్ల నిధులను యాంకర్‌ ఇన్వెస్టర్‌ ద్వారా సమీకరించింది. 8,20,94,594 షేర్లను  షేరు రూ. 37 (అప్పర్‌ లిమిట్‌) చొప్పున ఐపీఓ కేటాయింపులను ఖరారు చేసింది. సింగపూర్ ప్రభుత్వం, సీఎక్స్‌ పార్ట్‌నర్స్ ఫండ్ 2, గోల్డ్‌మన్ సాచ్స్ ఇండియా, అబెర్డీన్ స్టాండర్డ్ ఏషియన్ స్మాల్ కంపెనీస్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

11,800 స్థాయిని కోల్పోతేనే, మార్కెట్‌ బేర్స్‌ చేతుల్లోకి!

Saturday 30th November 2019

మార్కెట్‌ ధోరణిని చూస్తే, నిఫ్టీ 11,800 స్థాయిని(వారపు ఆధారంగా) కోల్పోతేనే తప్ప ప్రస్తుత అప్‌మూవ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యురిటీస్‌, సీఎండీ దినేష్‌ థక్కర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..   నిఫ్టీ వరుసగా మూడవ నెలలో కూడా నిలకడగా పెరుగుతూ కదిలింది. ఈ నెలలో నిఫ్టీ సుమారుగా 1.5 శాతం వృద్ధి చెందింది. రంగాల వారిగా చూస్తే, బ్యాంక్‌ నిఫ్టీ, ఫైనాన్సియల్స్‌

Most from this category