News


భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం రూ.964 కోట్లు

Tuesday 22nd October 2019
news_main1571715009.png-29037

  • 61 శాతం వృద్ధి 
  • 93,421కు చేరిన మొత్తం టవర్ల సంఖ్య 

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ టవర్ల విభాగం,  భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.600 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ2లో రూ.964 కోట్లకు పెరిగిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తెలిపింది. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గిందని కంపెనీ చైర్మన్‌ అఖిల్‌ గుప్తా తెలిపారు. గత క్యూ2లో రూ.3,668 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో రూ.3,438 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. టవర్ల సంఖ్య 1,298 పెరిగి 93,421కు పెరిగిందని తెలిపారు. టవర్లు, కో లొకేషన్ల సంఖ్య ప్రతి క్వార్టర్‌కు పెరుగుతూనే ఉందని వివరించారు. డేటా వినియోగం జోరుగా పెరుగుతుండటంతో టవర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా మంచి వృద్ధిని సాధించగలదన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు యప్‌టీవీ!

Tuesday 22nd October 2019

‘ట్రిపుల్‌ ప్లే’ సేవలకోసం ఇరుపక్షాల ఒప్పందం దీపావళికి ముందే వేతనాలు: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు త్వరలో యప్‌ టీవీ ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌–యప్‌ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పుర్వార్, యప్‌ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్‌ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో

పుత్తడి బాండ్ల ఇష్యూ ధర.. రూ.3,835

Tuesday 22nd October 2019

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్‌  ఈ నెల 25న ముగింపు  న్యూఢిల్లీ:- పుత్తడి బాండ్ల ఆరో దఫా జారీని కేంద్రం సోమవారం ప్రారంభించింది. ధన్‌తేరస్‌ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు జోరుగా జరుగుతాయనే అంచనాలతో ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) జారీని కేంద్రం ప్రారంభించింది. ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20-సిరీస్‌ సిక్స్‌.... ధన్‌తేరస్‌ రోజునే (ఈ నెల25న) ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక్కో గ్రామ్‌ ధరను రూ.3,835గా కేంద్రం

Most from this category