News


సుప్రీం తీర్పుతర్వాతే నిర్ణయం: భారతీ ఇన్‌ఫ్రాటెల్‌

Thursday 27th February 2020
Markets_main1582784887.png-32137

ఇండస్‌ టవర్స్‌ విలీనంపై భారతీ ఇన్‌ఫ్రాటెల్‌

ఇండస్‌​ టవర్స్‌ను విలీనం చేసుకోవడంతో పాటు, ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ ఐడియాకు ఉన్న 7 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని క్లియరెన్స్‌లు పూర్తయినప్పటికి ఇండస్‌ టవర్స్‌ విలీనంతోపాటు, టవర్స్‌లోని వొడాఫోన్‌ ఐడియా 7 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను  మరో రెండు నెలలు పొడిగించనుంది. వొడాఫోన్‌ ఐడియాకు నగదు కొరతతో అనిశ్చితి నెలకొనడం, ఏజీఆర్‌ బకాయిలు రూ.57,000 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో వొడాఫోన్‌ ఐడియా మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 17న సుప్రీంకోర్టులో ఏజీఆర్‌ బకాయిలు హియరింగ్‌ ఉండడంతో ఆరోజు వచ్చే ఫలితాన్ని బట్టి  పేమెంట్‌లు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లు వేచి చూస్తున్నట్లు సమాచారం. కాగా గురువారం మధ్యహ్నం 11:30 గంటల ప్రాంతంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేరు 0.18 శాతం పెరిగి 219.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

రైట్స్‌, మహీంద్రా సీఐఈ పతనం

Thursday 27th February 2020

ఆఫర్‌ ఫర్‌ సేల్‌తో రైట్స్‌ డీలా మహీంద్రా సీఐఈకి క్యూ3 ఫలితాల దెబ్బ సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతోంది. దీంతో ఈకౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఆటో విడిభాగాల కంపెనీ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు

భారీ డివిడెండ్ల చెల్లింపునకు కంపెనీలు సిద్ధం!

Thursday 27th February 2020

కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి రాకమునుపే కంపెనీలు డివిడెండ్‌ను చెల్లించడానికి హడావిడి చేస్తున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సి ఉండటం ఇందుకు కారణమైంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి(ఫిబ్రవరి 1) నుంచి ఇప్పటికి వరకు 204 కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. మరో 32 కంపెనీలు డివిడెండ్లపై నిర్ణయం తీసుకోనేందుకు రాబోయే మూడు రోజుల్లో బోర్డు సమావేశాలను నిర్వహించనున్నాయి. 2019లో 90కంపెనీలు,

Most from this category