News


మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

Friday 23rd August 2019
news_main1566541163.png-27969

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో వికాస్‌సేత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో ప్రతీ రోజూ  17.6 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌ అందిస్తోంది. భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో 2025 నాటికి 50 లక్షల  మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న తమ లక్ష్యం దిశగా మరికొన్ని అడుగులు వేసేందుకు వీలవుతుందని అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సీఈవో శ్రీధర్‌ వెంకట్‌ పేర్కొన్నారు. 



You may be interested

త్వరలో ఐఆర్‌సీటీసీ ఐపీఓ

Friday 23rd August 2019

ఇష్యూ సైజు రూ.500-600 కోట్లు  న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)  త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. రైల్వేలకు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ఐపీఓ ముసాయిదా  పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సం‍స్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల దాదాపు 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ సైజు రూ.500-600 కోట్ల రేంజ్‌లో

అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

Friday 23rd August 2019

ఆర్థిక మందగమనంపై  నీతి ఆయోగ్‌ సూచన ఫైనాన్షియల్‌ రంగంలో  ఎన్నడూ లేనంత ఒత్తిడి  ప్రైవేటు రంగంలో  ఒకరినొకరు విశ్వసించని స్థితి... దీని నివారణకు చర్యలు అవసరం న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనడానికి అసాధారణ చర్యలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కేంద్రానికి సూచించారు. ఫైనాన్షియల్‌ రంగంలో ముందెన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడి నెలకొందనీ, ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతకూ ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో

Most from this category