News


ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌లో రూ.325 కోట్లు పెట్టుబడులు

Wednesday 3rd July 2019
news_main1562136003.png-26757

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు 
భారతీ ఎంటర్‌ప్రైజెస్‌..రూ.65 కోట్లు

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.65 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ, టోఫ్లర్‌ తెలిపింది. కాగా ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పెట్టుబడులు కొనసాగిస్తామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్‌ సేవలందించడం, డిజిటల్‌ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా డిజిటల్‌ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయని వివరించారు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లెట్స్‌ 5 లక్షలకు చేరాయని, మంచి వృద్ధి సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిటైల్‌ బ్యాంకింగ్‌ పాయింట్స్‌ ద్వారా భారతీ ఆక్సా లైఫ్‌ పాస్‌ సరళ్‌ జీవన్‌ బీమా యోజన టర్మ్‌ పాలసీని విక్రయించనున్నామని తెలిపారు. ఈ మేరకు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షల పాలసీలను ఎంచుకోవచ్చని, వీటికి ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయని వివరించారు. You may be interested

బుల్లిష్‌గా మారిన 126 షేర్లు

Wednesday 3rd July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

ఓలా ఎలక్ట్రిక్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు

Wednesday 3rd July 2019

రూ.1,725 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌  న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ వాహన విభాగం, ఓలా ఎలక్ట్రిక్‌​ మొబిలిటీ(ఓఈఎమ్‌)లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ రూ.1,725 కోట్లు(25 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు ఓఈఎమ్‌ వెల్లడించింది. రూ.10 ముఖ విలువ గల పూర్తిగా, తప్పనిసరిగా మార్చుకునే సిరీస్‌ బి ప్రిఫెరెన్స్‌ షేర్లను సాఫ్ట్‌బ్యాంక్‌ టొపాజ్‌ (కేమ్యాన్‌) లిమిటెడ్‌కు జారీ చేయడం ద్వారా రూ.1,725 కోట్లు సమీకరించామని ఓఈఎమ్‌

Most from this category