News


ఎయిర్‌టెల్‌ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 31st January 2019
news_main1548915542.png-23918

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ నేడు క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా కంపెనీ నష్టాలు రూ. 500- 900 కోట్ల మధ్య ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. రెవెన్యూ వృద్ధి ఒక్క శాతం ఉండొచ్చని, ఇందుకు ప్రధానంగా ఆఫ్రికా వ్యాపారమే కారణమని అంచనా వేస్తున్నాయి. దేశీయ వ్యాపారంలో కూడా కన్సాలిడేషన్‌ కనిపిస్తోందని తెలిపాయి. నికర ఆదాయంలో 15- 20 శాతం నష్టం ఉండొచ్చని అంచనా. కస్టమర్లు తగ్గడం ఫలితాలపై ప్రభావం చూపనుంది. 
ఫలితాల్లో ముఖ్యంగా చూడాల్సినవి..
- ఫండ్‌రైజింగ్‌ ప్రణాళికలపై స్పష్టత
- టెలికం రంగంలో పోటీపై కామెంటరీ
- కన్సాలిడేటెడ్‌ రెవెన్యూ
- మొత్తం ఎబిటా
- దేశీయ వైర్‌లెస్‌ రెవెన్యూ
- దేశీయ ఎబిటా



You may be interested

వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు ఫెడ్‌ బ్రేక్‌

Thursday 31st January 2019

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించిన సంకేతాలు కన్పిస్తున్న దృష్ట్యా వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు బ్రేక్‌ వేస్తున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించింది. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ...రెండు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేస్తూ ఈ ఏడాది కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించబోమని, రేట్ల పెంపుపై సహనం వహిస్తామని అమెరికా కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడులు నెమ్మదించడం

ఐసీఐసీఐ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st January 2019

క్యు3 ఫలితాలు ఆశావహంగా ఉండడంతో పలు బ్రోకరేజ్‌లు ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై పాజిటివ్‌గా మారాయి. క్యు3లో బ్యాంకు ఎన్‌ఐఐ, మార్జిన్లు మంచి వృద్ది నమోదు చేయడంతో పాటు మొండిపద్దుల విషయంలో మంచి మెరుగుదల చూపింది. దీంతో బ్యాంకు ఎన్‌పీఏ సైకిల్‌ టాప్‌అవుట్‌ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు.  బ్రోకరేజ్‌ల అంచనాలు - సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 450 నుంచి 470కి పెంచింది. ఎర్నింగ్స్‌లో మెరుగుదల కనిపిస్తోంది. కాసా బలంగా ఉంది. ఫైనాన్స్‌

Most from this category