STOCKS

News


ఎయిర్‌ టెల్‌ నష్టాలు రూ.2,856 కోట్లు

Friday 2nd August 2019
news_main1564724448.png-27489

  • 14 ఏళ్ల తర్వాత నష్టాలు 
  • 5 శాతం వృద్ధితో రూ.20,738 ‍‍‍కోట్లకు మొత్తం ఆదాయం
  • రూ.129కు పెరిగిన ఏఆర్‌పీయూ 

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్‌ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్‌కు సంబంధించి తరుగుదల వ్యయాలు,  భారీగా పన్ను వంటి అసాధారణ అంశాల కారణంగా ఈ క్యూ1లో  ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3 శాతం, ఆఫ్రికాలో ఆదాయం 10 శాతం చొప్పున పెరిగాయని వివరించింది. 
94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్‌...
మొబైల్‌  కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ-యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్‌పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్‌ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా) గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు. 



You may be interested

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

Friday 2nd August 2019

వాటా పెంచుకున్న స్వీడన్‌ కంపెనీ కొత్తగా మరో మూడు ఆసుపత్రులు మెడికవర్‌ ఎండీ అనిల్‌ కృష్ణ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ పేరు మారింది. ఇక నుంచి మెడికవర్‌ హాస్పిటల్స్‌గా పిలుస్తారు. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రమోట్‌ చేస్తున్న సహృదయ హెల్త్‌కేర్‌లో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు ఇప్పటి వరకు 46.5 శాతం వాటా ఉంది. నవంబరు నాటికి ఇది 51 శాతానికి చేరనుంది. హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్స్‌ సేవలతో అంతర్జాతీయంగా విస్తరించిన

దివాలా స్మృతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Friday 2nd August 2019

7 సెక్షన్లకు సవరణలు న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్‌ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు

Most from this category