News


ఎయిర్‌టెల్‌ 200 కోట్ల డాలర్ల క్యూఐపీ మొదలు

Thursday 9th January 2020
news_main1578543572.png-30790

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌ క్యాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) ఇష్యూ మొదలైంది. ఈ ఇష్యూకు ఫ్లోర్‌ ధరగా రూ.452.09ను నిర్ణయించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.14,200 కోట్లు) సమీకరిస్తామని పేర్కొంది. అంతే కాకుండా ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌(ఎఫ్‌సీసీబీ)ల ‍ద్వారా మరో వంద కోట్ల డాలర్లు(రూ.7,100 కోట్లు) సమీకరిస్తామని తెలిపింది. క్యూఐపీ, ఎఫ్‌సీసీబీల ద్వారా సమీకరించిన నిధులను నెట్‌వర్క్‌ విస్తరణకు, ఏజీఆర్‌(సవరించిన స్థూల ఆదాయం) బకాయిలు చెల్లించడానికి వినియోగిస్తామని వివరించింది. 



You may be interested

బలపడ్డ రూపాయి

Thursday 9th January 2020

ప్రారంభంలోనే 27 పైసలు అప్‌ బుధవారం 12 పైసలు ప్లస్‌ డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వచ్చిన దేశీ కరెన్సీ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇరాన్‌, అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు చల్లబడనున్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్‌నిచ్చాయి. దీంతో చమురు, బంగారం ధరలు చల్లబడగా రూపాయి బలపడుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి గురువారం ట్రేడింగ్‌లో 27 పైసలు ఎగసింది. 71.43 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 ప్రాంతంలో 23

గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలి

Thursday 9th January 2020

90 శాతం మేర రుణం ఇవ్వాలి స్టాంప్‌ డ్యూటీ 50 శాతానికి తగ్గించాలి ప్రి బడ్జెటరీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రికి నరెడ్కో విన్నపం సాక్షి, న్యూఢిల్లీః- గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతంపైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. యూనియన్‌ బడ్జెట్‌

Most from this category