News


మరో రూ.8,004 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్

Saturday 29th February 2020
news_main1582963969.png-32188

న్యూఢిల్లీ:- ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా కేంద్ర టెలికాం శాఖకు రూ.8,004 కోట్లను చెల్లించినట్లు భారతీ ఎయిర్‌టెల్ శనివారం తెలిపింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ తన ఏజీఆర్‌ బకాయిల్లో భాగంగా రూ .10,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పటి తాజా చెల్లింపుతో కలిపి మొత్తం రూ.18,004 కోట్లు చెల్లించినట్లైంది. ఏజీఆర్‌కు సంబంధించిన స్వీయ మదింపు కసరత్తు పూర్తైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్, భారతీ హెక్సాకోమ్, టెలినార్ ఇండియా బకాయిలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 



You may be interested

క్రాష్‌తో...కుబేరుల సంపద కరిగిపోయిందిలా..!

Saturday 29th February 2020

ఇండియాలో  అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌లు పతనమవ్వడంతో 5 బిలియన్‌డార్ల తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలో ఉన్న ఫార్చూన్‌ 500 బిలీయనీర్స్‌ సంపద కూడా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో 444 బిలియన్‌ డాలర్లుత తగ్గింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సూచీ 12 శాతానికిపైగా పడిపోయింది. 2008 ఆర్థిఖ

ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.2,769 కోట్ల సమీకరణ

Saturday 29th February 2020

ముంబై:- ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సంస్థ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,769 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ఐపీఓ ఒకరోజు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 3.66 కోట్ల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.1,480ల వద్ద కేటాయించి ఈ మొత్తాన్ని సమీకరించినట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ సంస్థ వెల్లడించింది. సింగపూర్‌ గవర్నమెంట్‌, మానిటరీ ఆథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌, బిర్లా గ్రూప్‌లతో

Most from this category