News


ఎయిర్‌టెల్‌ ఫలితాలు వాయిదా!

Tuesday 29th October 2019
news_main1572322788.png-29196

నవంబర్‌ 14న వెల్లడి

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదలను భారతీ ఎయిర్‌టెల్‌ వాయిదా వేసింది. మంగళవారం ఫలితాలు వెలువరించాల్సిఉండగా, వీటిని వచ్చే నెల 14కు వాయిదా వేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) అంశంపై మరింత స్పష్టత రావాల్సిఉందని అందుకే ఫలితాలు వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఏజీఆర్‌ నిర్వచనానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు టెల్కోలకు షాక​ ఇచ్చే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మరింత స్పష్టత కోసం డీఓటీని సంప్రదిస్తున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. తీర్పు అనంతరం ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది? తదితర అంశాలపై వివరణతో పాటు ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాలని కంపెనీ టెలికం శాఖను కోరింది.

సుప్రీం తీర్పుతో ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ కింద రూ. 21,700 కోట్లు చెల్లించాల్సివస్తుంది. అందుకే ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చాక క్యు2 ఫలితాలు వెల్లడించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఫలితాల ప్రకటన నవంబర్‌ 14కు వాయిదా వేసామని, ఈ మేరకు కంపెనీ బోర్డుకు తెలియజేశామని కంపెనీ స్టాక్‌ ఎక్చేంజ్‌లకు తెలిపింది. మేనేజ్‌మెంట్‌ సూచనకు బోర్డు కూడా ఆమోదం తెలిపిందని, ఫలితాల వాయిదాకు అంగీకరించిందని పేర్కొంది. ఫలితాల వెల్లడి మినహా ఈ రోజు మీటింగ్‌లో చర్చించాల్సిన అన్ని అంశాలూ యథాతధంగా బోర్డు చర్చిస్తుందని కంపెనీ తెలియజేసింది. 



You may be interested

టాటాస్టీల్‌ 7% అప్‌!

Tuesday 29th October 2019

టాటా స్టీల్‌ భుషణ్‌ స్టీల్‌ ఉత్పత్తి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పెరగడంతో టాటా స్టీల్‌ ఉత్పత్తి ఇండియాలో పెరిగింది. అంతేకాకుండా అమ్మకపు పరిమాణం గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే మార్పులేనప్పటికి, గత త్రైమాసికంతో పోల్చుకుంటే పెరిగింది. ఫలితంగా ఈ కంపెనీ తన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో మంచి సంఖ్యలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీటితో పాటు టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడం,

టాటా మోటర్స్‌ 15 శాతం ర్యాలీ!

Tuesday 29th October 2019

టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ర్యాలీ చేస్తోంది. ఆదివారం ముహురత్‌ ట్రేడింగ్‌లో 17 శాతం లాభపడిన ఈ షేరు, మంగళవారం సెషన్లో ఉదయం 9.45 సమయానికి 15 శాతం లాభపడి రూ. 170 వద్ద గరిష్టస్థాయిని చేరచ్చు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గత సెషన్‌లో రూ. 147.70 వద్ద ముగిసిన టాటా

Most from this category