News


ఎయిర్‌టెల్‌ 400 కోట్ల డాలర్ల సమీకరణ

Thursday 5th December 2019
news_main1575521249.png-30069

ఏజీఆర్‌ ఇక్కట్ల నుంచి బయటపడేందుకు ఎయిర్‌టెల్‌ సన్నాహాలు ఆరంభిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ బోర్డు బుధవారం 400 కోట్ల డాలర్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ప్రస్తుతానికి 300 కోట్ల డాలర్లను వివిధ రూపాల్లో సమీకరిస్తారు. 200 కోట్ల డాలర్లను క్యుఐపీ మార్గంలో, వంద కోట్ల డాలర్లను ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా, మరో వంద కోట్ల డాలర్లను ఎన్‌సీడీల జారీ ద్వారా సమీకరించేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఇందులో చివరి రెండు మార్గాల్లో కలిపి ప్రస్తుతానికి వందకోట్ల డాలర్లు సమీకరిస్తారు. తొలుత 200 కోట్ల డాలర్ల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ దశల్లో క్యుఐపీ లేదా ఈక్విటీ షేర్ల విక్రయం లేదా రెండు కలిపి చేపడతామని కంపెనీ తెలిపింది. ఈ ప్రణాళికల అమలు కోసం డైరెక్టర్ల ప్రత్యేక కమిటీని కంపెనీ ఏర్పరిచింది.

ఏజీఆర్‌ కింద కంపెనీ దాదాపు 29వేల కోట్లను చెల్లించాల్సిఉంది. దీంతో పాటు స్పెక్ట్రం బకాయిలు, జరిమానాలు, వడ్డీలు.. ఇలా చాలా రూపాల్లో కంపెనీపై ఆర్థిక భారం పడుతోంది. వీటిని తట్టుకునేందుకు కంపెనీ ఇటీవలే జియో, ఐడియా మార్గంలో టారిఫ్‌లు పెంచింది. ఈ పెంపుదలతో కంపెనీ మొబైల్‌రెవెన్యూలో దాదాపు రూ.10 వేల కోట్ల పెరుగుదల ఉండొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దీంతోపాటు కన్సాలిడేటెడ్‌ ఎబిటా 32 శాతం మేర పెరగవచ్చని, డెట్‌ టు ఎబిటా 2.7 రెట్లకు దిగిరావచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపుతో వచ్చే ఆదాయంతో పాటు మరింత ఆదాయం కోసం కంపెనీ నిధులు సమీకరించనుంది. 



You may be interested

దిగివచ్చిన పసిడి

Thursday 5th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం నెలరోజుల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో మొదటి దశ ఒప్పందం దాదాపు ఖరారయ్యానే అంశం పసిడికి దిగివచ్చేందుకు కారణవుతోంది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,481.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలతో పసిడి ధర నిన్న ఉదయం ట్రేడింగ్‌లో 1,489.85 డాలర్ల వద్ద

స్టీల్‌ షేర్లు... తగ్గినప్పుడల్లా కొనొచ్చు!

Thursday 5th December 2019

నిపుణుల సూచన అంతర్జాతీయంగా స్టీల్‌ రంగం బాగుందని, ఈ నేపథ్యంలో దేశీయ స్టీల్‌స్టాకుల్లో వచ్చే పతనాలకు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఇలాంటి పతనాలను కొత్త కొనుగోళ్లకు అవకాశాలుగా మలచుకోవాలని చెప్పారు. ట్రేడ్‌వార్‌ జాప్యం జరగొచ్చన్న పుకార్లు ఇటీవల స్టీల్‌స్టాకుల్లో కరెక‌్షన్‌ తెచ్చాయి. యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలతో ఇటీవల కాలంలో జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌పీఎల్, సెయిల్‌ తదితర షేర్లు నష్టాలు చూశాయి. అయితే వాల్యూషన్లు,

Most from this category