ఫలితాల్లో అదరగొట్టిన భారత్ఫోర్జ్
By Sakshi

న్యూఢిల్లీ: భారత్ ఫోర్జ్ మార్చి త్రైమాసికం ఫలితాలతో మెప్పించింది. స్టాండలోన్ లాభం మూడు రెట్లు పెరిగి రూ.299 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.1,718 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.100 కోట్లు, ఆదాయం రూ.1,500 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10,348 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.1,032 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,556 కోట్లు, లాభం రూ.753 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.2.5 చొప్పున ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.
You may be interested
ఏప్రిల్లో భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
Tuesday 21st May 201954 శాతం వృద్ధితో 3.97 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులు ఏప్రిల్లో భారీగా పెరిగాయి. 2018 ఏప్రిల్ దిగుమతుల పరిమాణం 2.58 బిలియన్ డాలర్లతో పోల్చితే 2019 ఏప్రిల్లో 54 శాతం వృద్ధితో 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. అయితే ఈ పరిణామం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్ధిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకం మధ్య ఉండే
వాహన బీమా మరింత భారం..
Tuesday 21st May 2019థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ల పెంపునకు ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు కార్లు, బైకులు, స్కూల్ బస్సులు, ట్యాక్సీలు అన్నింటిపైనా వడ్డింపు లగ్జరీ కార్లు, సూపర్ బైక్లకు యథాతథంగా ప్రస్తుత రేటు న్యూఢిల్లీ: వాహనదారులపై బీమా భారం మరింత పెరిగేలా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు చేసింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గణనీయంగా పెంచే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ