News


భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్ ప్రారంభం

Friday 13th December 2019
news_main1576208695.png-30201

  • ఈ నెల 20న ముగింపు 
  • రూ.15,000 కోట్ల సమీకరణ లక్ష్యం 

న్యూఢిల్లీ: దేశంలో తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌), భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.7 రెట్లు (రూ.2,980కోట్ల మేర బిడ్‌లు వచ్చాయి)ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు నేటి(శుక్రవారం) నుంచి సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చు. ఈ నెల 20న ముగిసే ఈ ఈటీఎఫ్‌ ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ఈటీఎఫ్‌ను ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఇన్వెస్టర్ల కనీస ఇన్వెస్ట్‌మెంట్‌  రూ.1,000. ప్రభుత్వ రంగ సంస్థల ట్రిపుల్‌ ఏ-రేటింగ్‌ బాండ్లలో ఈ ఈటీఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 13th December 2019

అటు అమెరికా-చైనాల ట్రేడ్‌డీల్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలపడం, ఇటు బ్రిటన్‌ ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ విజయం సాధించవచ్చన్న ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు భారీ ర్యాలీ జరుపుతున్న నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 178 పాయింట్ల లాభంతో 40,752 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 12,026 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

ఇన్ఫీకి మరో తలనొప్పి

Friday 13th December 2019

(అప్‌డేటెడ్‌...) అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు లాస్ ఏంజెలిస్:   సీఈవో, సీఎఫ్‌వోలపై ప్రజావేగుల ఫిర్యాదులతో సతమతమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్ లా ఫర్మ్‌ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్‌ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను

Most from this category